జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండలం లో 5 వ తేదీ గురువారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు పటిష్టమైన భద్రతా ఈ మేరకు ఏర్పాట్లు చేశామని పట్టణ సిఐ కె నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సిబ్బంది కీ తెలిపారు. ఇప్పటికే ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలు సంయమనంతో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.