ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించిన ప్రతి ఒక్కరకి మున్సిపల్ కమిషనర్, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎల్. రామలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని ప్రతి అంశాన్ని పారదర్శకంగా జవాబుదారీతనంగా సిబ్బందికి నిర్దేశించిన విధులను శతశాతం నిర్వహించినందుకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను అందరి సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించేందుకు మీ అందరి కృషి అవసరమని తెలిపారు.