BREAKING
పోలింగ్ కేద్రాల వద్ద, 144,30 పోలీస్ యాక్ట్ ఉంది జాగ్రత్త. డి.ఎస్.పి దైవప్రసాద్ తెలుగుదేశం తోనే అభివృద్ధి సంక్షేమం మహిళల ప్రీమియర్ లీగ్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి గ్రాండ్‌గా టీ20 సమరం! శ్రీవారి హుండీల ఆదాయం రూ. 2 కోట్ల 52 లక్షలు తమిళనాడులో థియేటర్లలో రోజుకు ఆరు ప్రదర్శనలకు అనుమతి.. చిత్ర పరిశ్రమకు పెద్ద దీపావళి కానుక అన్న తిరుప్పూర్ సుబ్రమణియన్! తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 1వ డివిజన్ నూతన కార్పొరేటర్ కాయం వెంకటరత్నం ఇండో-పసిఫిక్‌లో సరఫరా గొలుసుల పటిష్టతకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు పోలాండ్‌లో 50 కోట్ల డాలర్ల భారీ పెట్టుందుకు షీన్ ప్లాన్ హెల్త్‌కేర్ రంగంలో దూసుకుపోయిన ఇన్సూరెన్స్, ఆసుపత్రి సంస్థల షేర్లు నార్వే రాజ కుటుంబంలో గృహ నిర్బంధంలోనే మేరియస్ బోర్గ్ హోయిబి కొనసాగింపు కార్పొరేట్ దిగ్గజం బీఎండబ్ల్యూకి సవాళ్లు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకులతో కలిసి 'జైలర్ 2' సినిమా చూసిన పుదుచ్చేరి సీఎం.. రజినీకాంత్ క్రేజ్ చూసి ఫిదా! గేమింగ్ రంగానికి గీతరావాలా లేక అద్దమా....గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6పై ఆర్థిక విశ్లేషణ తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసిన 10వ డివిజన్ నూతన కార్పొరేటర్ రాణి కుందుర్పిలో పూర్తిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది.

బాలల ఆరోగ్య వికాసానికి కృషి చేయాలి

Select Suryaa Now
బాలల ఆరోగ్య వికాసానికి కృషి చేయాలి

పార్వతీపురం, సూర్య : బాలల సంపూర్ణ ఆరోగ్య వికాసానికి కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని (డిఇఐసి) బుధవారం సందర్శించారు. 4డి లక్షణాలు ఉన్న ఎంత మంది పిల్లలకు ప్రతీ రోజూ వైద్య సేవలు అందిస్తున్నారు, వారి సమస్యలు, ఆరోగ్యం మెరుగు వివరాలపై రికార్డులో తనిఖీ చేశారు. శారీరక, మానసిక వైకల్యాలు, పుట్టుక నుండి సంక్రమించే లోపాలు, వ్యాదులు, ఎదుగుదల జాప్యం మొదలగు సమస్యలకు కేంద్రం ద్వారా అందిస్తున్న థెరపీ, చికిత్స, ఎర్లీ ఇంటర్వెన్సెన్ , ఉపకరణాల తో ఏ మేరకు మెరుగుపడుతున్నది  పరిశీలించారు. ఆర్.బి.ఎస్.కె 2.O స్క్రీనింగ్ అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సిబ్బంది, వైద్యాధికారులు పక్కగా నిర్వహించి 4డి లక్షణాలున్న వార్ని గుర్తించి అవసరమైన వారిని డిఇఐసి కి రిఫర్ చేయాలన్నారు. కేంద్రంలో సేవలతో పాటు, అవసరమైన వారికి అనుబంధ ఆసుపత్రులతో సమన్వయం చేస్తూ ఉచిత శస్త్ర చికిత్సలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. పిహెచ్సీ వైద్యులు, సిబ్బందితో డిఇఐసి స్టాఫ్ సమన్వయం చేసుకుంటూ 4డి సమస్యలున్న పిల్లలకు సత్వరమే చికిత్స అందించి వారి జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఆర్.కె.ఎస్.కె విభాగoలో రికార్డులు, ఆన్లైన్ నివేదికలు తనిఖీ చేశారు. కిశోర బాలలకు ఎప్పటికపుడు కౌన్సిలింగ్, అవగాహన నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణుడు డా ఎల్. భరత్ చంద్ర, డెంటల్ వైద్యులు డా కె. సౌజన్య , ఎర్లీ ఇంటర్వెన్సెనిస్ట్ స్రవంతి, ఆర్.కె.ఎస్.కె కౌన్సిలర్ భారతి, స్టాఫ్ అంజమ్మ, మంగ తదితరులు ఉన్నారు.