జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు అంతా సిద్ధం
బొబ్బిలి, సూర్య : బొబ్బిలి మండలం లో గురువారం జరగనున్న ఒక జెడ్పీటీసీ, 19 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికల కు అంతా సిద్ధం చేశామని సహాయ ఎన్నికల రిటర్నింగ్, ఎంపిడిఓ అధికారి పి. రవికుమార్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం 5 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరుగుతుందని, అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను అధికారులు సమన్వయంతో చేపట్టారు. పోలింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి అవసరమైన సూచనలు, బాధ్యతలను ఇప్పటికే తెలియజేశారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి పంపిణీ, రవాణా తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది:
ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. అన్ని మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడినుంచి సిబ్బంది తమకు కేటాయించిన ఎన్నికల సామగ్రిని తీసుకొని తరలివెళ్లారు.