జరజాపు కృషితో విజయకుమారి గెలుపు
సాలూరు, సూర్య : జరజాపు సోదరుల వ్యూహంతో గ్లాసు గుర్తు అభ్యర్థి గొర్లె విజయకుమారీకి గెలుపు వరించందనే చెప్పుకోవచ్చు. మున్సిపల్ చైర్మన్ సీటు రిజర్వేషన్లో బీసి మహిళకు కేటాయించడంతో తెలుగుదేశం పార్టీ తరుపున వ్యూహాత్మకంగా మంత్రి అనుచరుడు బార్యను ముందు ప్రకటించారు. ఈలోపు చాకచక్యంగా గొర్లె విజయకుమారి భర్త మధు, రాత్రికి రాత్రే నాగాబాబును ప్రశన్నం చేసుకొని జనసేన పార్టీ తరఫున సీటును దక్కించుకున్నారు. సాలూరులో స్తబ్దతగా వున్న జనసేన పార్టీ జరజాపు సూరిబాబు తన సోదరుల రాకతో పార్టీని పరుగులు పెట్టించారు. ఆ మేరకు ఛైర్పర్సన్ రేసులో జరజాపు సూరిబాబు కోడలు దీప్తిని రేసులో నిలబెట్టేందుకు ఆశక్తి చూపించారు.మధు సీటు తెచ్చుకోవడంతో తొలుత సూరిబాబు అసహనంతో వున్న మాట వాస్తవమే అయినాప్పటికీ, గొర్ల మధు సీటు తెచ్చుకోవడంతో కూటమి ధర్మాన్ని పాటిస్తూ, గొర్ల విజయకుమారి విజయం కోసం అనుక్షణం సూరిబాబు కష్టపడ్డారనే పురవాసులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.