గోల్ఫ్ క్లబ్ సహకారంతో క్రీడను ప్రోత్సహించనున్న వైజాగ్ డాల్ఫిన్స్
ఆరిలోవ, సూర్య : గోల్ఫ్ గమ్యస్థానంగా విశాఖపట్నానికి పెరుగుతున్న ఖ్యాతి ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది, ఎందుకంటే ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఏ ఎమ్ గ్రీన్ ఐ.జి.పి.ల్ లీగ్‌లో భాగమైన గ్రీన్ ఫ్యూయెల్స్ మారిటైమ్ ఇన్విటేషనల్ 2026ను నిర్వహిస్తోంది. ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్‌లో జరుగుతున్న మొదటి ఐజిపిల్ ఈవెంట్ ఇదే. గతంలో ఈ క్లబ్ అనేక ఇండియన్ గోల్ఫ్ యూనియన్ మరియు ఉమెన్స్ గోల్ఫ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈవెంట్‌లను నిర్వహించింది. గ్రీన్ ఫ్యూయెల్స్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు వైజాగ్ డాల్ఫిన్స్ జీసీ సహ-యజమాని సుధాకర్ కలిగిత్తి, తన ఫ్రాంచైజీ వైజాగ్ డాల్ఫిన్స్ ద్వారా వైజాగ్‌లో గోల్ఫ్‌ను ప్రోత్సహించడం గురించి మాట్లాడుతూ ఎంతో ఉత్సాహం వ్యక్తం చేశారు.గ్రీన్ ఫ్యూయెల్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని వైజాగ్ డాల్ఫిన్స్ జీసీ కి, నగరంలో ఈ క్రీడను "ఆంధ్రప్రదేశ్ కోసం ఒక ఫ్రాంచైజీ జట్టును తీసుకోవాలని మేము ఆసక్తిగా ఉన్నాము, అందుకే వైజాగ్ డాల్ఫిన్స్ జీసీ పేరుతో గోల్ఫ్ జట్టును ఎంచుకున్నాము. ఒలింపిక్ క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే మా ముఖ్య ఉద్దేశ్యం," అని శ్రీ కలిగిత్తి అన్నారు.ఎమ్ గ్రీన్ ఐ జి గపిల్ సీఈఓ మరియు మాజీ ఆసియన్ టూర్ ప్రొఫెషనల్ శ్రీ ఉత్తమ్ సింగ్ మండి, లీగ్ యొక్క కొత్త స్పీడ్-గోల్ఫ్ ఫార్మాట్ అయిన ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ గౌరవ కార్యదర్శి ఎస్ వి ఆర్ రాజు మాట్లాడుతూ, "ఎమ్ గ్రీన్ ఐ జి పిల్ ను మొదటిసారి నిర్వహించడం ఏపీజీసీ కి చాలా సంతోషంగా ఉంది, ఇక్కడ ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ జరగడానికి చొరవ చూపి, సహకరించిన జట్టు యజమానులైన వైజాగ్ డాల్ఫిన్స్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. .ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ ఉపాధ్యక్షుడు టీఎస్ వర్మ, వైజాగ్ డాల్ఫిన్స్ జీసీ డైరెక్టర్ సిహెచ్. రాజశేఖర్ మాట్లాడారు. ఈ టోర్నమెంట్ పూర్తయిన తర్వాత, మా ప్రోలతో మరిన్ని క్లినిక్‌లు నిర్వహించాలని, ఆపై ఐజిపిల్ సహకారంతో జూనియర్ గోల్ఫ్ కోసం అకాడమీని ప్రారంభించాలని శ్రీ మండి పేర్కొన్నారు.