చందుబట్ల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై వెంకట్ రెడ్డి బుధవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పెద్దముదునూరు గ్రామానికి చెందిన సంకి చెన్నకేశవులు (56) మేస్త్రి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతడు ఈ నెల 2న అదే గ్రామానికి చెందిన జంగం మల్లయ్య తో కలిసి ద్విచక్ర వాహనంపై నాగర్ కర్నూల్ కి వస్తుండగా చందుబట్ల గేటు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించగా సంకి చెన్నకేశవులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు..
- పి.వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: