*జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ...
విజయనగరం, సూర్య : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. రాంసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల వద్ద జరుగుతున్న ఏర్పాట్లు, పోలింగ్ బృందాలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్న తీరు, సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర అంశాలపై ఆరా తీసారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలు:
* జడ్పీటీసీ స్థానాలు – 27, పోటీలో ఉన్న అభ్యర్థులు – 103.
* ఎంపీటీసీ స్థానాలు – 449, ఏకగ్రీవాలు: 11 పోటీలో ఉన్న అభ్యర్థులు – 1,066.
* మొత్తం ఓటర్లు – 12,85,692.
* పురుషులు – 6,35,994
* మహిళలు – 6,49,661
* ఇతరులు – 37
* పోలింగ్ కేంద్రాలు – 1,586.
* సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు – 388.
* అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు – 323.
* వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియ పర్యవేక్షణ.
* ఎన్నికల అధికారులు: రిటర్నింగ్ అధికారులు: 30, సహాయ ఎన్నికల అధికారులు: 54
ప్రిసైడింగ్ అధికారులు: 1745
ఇతర పోలింగ్ సిబ్బంది: 10467
* ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలు – 27.
* జోనల్ అధికారులు: 93.
* మైక్రో అబ్జర్వర్లు: 156.
* వాహనాలు: 434
* ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి.
* కౌంటింగ్ కేంద్రాలు – 07.
* కౌంటింగ్ టేబుళ్లు – 433.
* కౌంటింగ్ సూపర్వైజర్లు - 433
* కౌంటింగ్ సిబ్బంది – 1,299.
పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ బృందాలు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని, ఎన్నికల సామగ్రి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, వెబ్ కాస్టింగ్ తదితర మార్గాల ద్వారా పోలింగ్ సరళిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.