వైసీపీ కంచుకోటలో కమలం పాగా ....
విజయనగరం, సూర్య : విజయనగర నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మరియు రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ అయిన కోలగట్ల వీరభద్ర స్వామి , కుమార్తె కోలగట్ల శ్రావణి సొంత వార్డుల్లో బీజేపీ విజయ బావుటా ఎగురవేసింది. నగరంలో 33, 38 లో భారతీయ జనతా పార్టీ 33వ వార్డు కార్పొరేటర్ గా కరణం శ్రీధర్ , 38 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి ఆడారి విజయ లక్ష్మీ , 11 వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి రవ్వ మంజు ఘన విజయం సాధించి, విజయకేతనం ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ తో కలిసి విజయం సాధించిన కార్పొరేటర్ లు విజయనగరం శాసనసభ్యులు గౌరవ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు కలవడం జరిగింది.