BREAKING
కావేరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘సమత్వ’ ఆవిష్కరణ పెద్దపంజాణి మండలంలో 45,284 మంది ఓటర్లు - పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం ఆత్మకూరులో క్రికెట్ టోర్నమెంట్స్ క్రికెట్ చరిత్రలో సంచలనం.. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన బ్యాటర్ బ్రిటన్ సుప్రీంకోర్టులో 'పాలస్తీనా యాక్షన్' నిషేధంపై విచారణ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డి.ఎస్.పి దైవప్రసాద్. ఉత్తరాఖండ్ ట్రెక్కింగ్ ప్రమాదం: ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు ఇటలీ పౌరుల వైద్య ఖర్చులను మాఫీ చేసిన స్విట్జర్లాండ్ పీవీ సింధు అరుదైన ఘనత.. ఏళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత చక్రపాణి సేవలు చిరస్మరణీయం శాసన మండలి మాజీ చైర్మన్ మృతిపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపం ఎతిసలాత్ బకాయిలపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు పాక్ యూరోపియన్ యూనియన్‌లో చేరికకు ఉక్రెయిన్ వేగంగా సంస్కరణలు చేపట్టాలి శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి జాతీయ దంత వైద్య విద్యా బోర్డు పార్ట్‌టైమ్ సభ్యుడిగా నియామకం ఆత్మకూరు సర్వతోముఖాభివృద్ధే ఇక అందరి లక్ష్యంగా సాగుదాం - మంత్రి ఆనం

గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి.

Select Suryaa Now
గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి.

*--జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా.* 

*--పోమాల్,తిమ్మాయపల్లి గ్రామాలలో ఆకస్మిక పర్యటన.* 

 *--ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.* 

 *--పల్లె సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు.* 

నవాబుపేట సూర్య న్యూస్: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ప్రజలకు నాణ్యమైన విద్య,వైద్య సేవలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు.బుధవారం మండలంలోని పోమాల్,తిమ్మాయపల్లి గ్రామాల్లో ఆమె ఆకస్మికంగా పర్యటించి ప్రభుత్వ పాఠశాలలు,అంగన్‌వాడీ కేంద్రాలు,ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం,పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు.ముందుగా పోమాల్ గ్రామంలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించిన కలెక్టర్ గ్రామస్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని గ్రామస్థులు తెలపడంతో వెంటనే చర్యలు తీసుకొని పరిశుభ్రతను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని ఆమె పరిశీలించారు.2వ,తరగతి విద్యార్థులకు బోర్డుపై రాసిన అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.ఓ విద్యార్థినికి అక్షరాలు సరిగా కనిపించకపోవడాన్ని గుర్తించి వెంటనే కంటి పరీక్షలు నిర్వహించాలని,అవసరమైతే ఆర్‌బీఎస్‌కే వైద్య బృందంతో పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయుడికి సూచించారు.విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.గ్రామంలో నీటి సరఫరా పైపులైన్ లీకేజీని గుర్తించిన కలెక్టర్,ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్నందున ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని సూచించారు.పైపులైన్ లీకేజీలను వెంటనే అరికట్టి నీటి వృథాను నివారించాలని ఆమె అన్నారు.ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ అక్కడ విద్యుత్ సౌకర్యం,ఫ్యాన్లు,లైట్లు లేకపోవడాన్ని కలెక్టర్ గుర్తించారు.అవసరమైన మౌలిక వసతులను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.రోగులు,గర్భిణులతో మాట్లాడి వైద్య సేవలు,మందుల లభ్యత,టీకాల అమలు తీరును ఆమె అడిగి తెలుసుకున్నారు.ఐదు గ్రామాల ప్రజలకు ఈ ఉపకేంద్రం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పోమాల్‌లోని గడ్డ కాలనీలో మూడేళ్ల క్రితం నిర్మించిన అంగన్‌వాడీ భవనం ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన కలెక్టర్ జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ అధికారి జరీనా బేగంతో ఫోన్‌లో మాట్లాడి భవనం ప్రారంభానికి నోచుకోకపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు.వెంటనే అవసరమైన చర్యలు తీసుకొని భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు.అనంతరం తిమ్మాయపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులు,గర్భిణులు,బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించారు. పిల్లల హాజరు,గర్భిణుల వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు చిన్నారుల బరువును స్వయంగా పరిశీలించారు.కేంద్రంలో పప్పులు, ఆకుకూరలు, గుడ్లు తదితర పోషకాహార పదార్థాల సరఫరా నిలిచిపోయిందని సిబ్బంది తెలపడంతో సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు.పోషకాహార సరఫరాలో అంతరాయం లేకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను వెంకటేష్ ఆదేశించారు.ఈ పర్యటనలో గ్రామ సర్పంచ్ కవిత,ఉపసర్పంచ్ ఆంజనేయులు,ఇన్‌చార్జి పంచాయతీ కార్యదర్శి క్రాంతికుమార్,జీపీఓ రమేష్,తదితరులు పాల్గొన్నారు.