BREAKING
ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ హిమాన్షు శుక్ల ఖేడ్ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ కి వినతిపత్రం అందజేసిన బిజెపి నాయకులు *పేదవాడి సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ ఛైర్మన్ దారం శంకర్* ప్రజా సమస్యలపై గళం విన్పిస్తా - కౌన్సిలర్ స్వప్న ఒకే దెబ్బకు రెండు ప్రపంచ రికార్డులు.. సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు రూ. 2,814 కోట్లు కావేరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘సమత్వ’ ఆవిష్కరణ పెద్దపంజాణి మండలంలో 45,284 మంది ఓటర్లు - పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం ఆత్మకూరులో క్రికెట్ టోర్నమెంట్స్ క్రికెట్ చరిత్రలో సంచలనం.. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన బ్యాటర్ బ్రిటన్ సుప్రీంకోర్టులో 'పాలస్తీనా యాక్షన్' నిషేధంపై విచారణ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డి.ఎస్.పి దైవప్రసాద్. ఉత్తరాఖండ్ ట్రెక్కింగ్ ప్రమాదం: ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు ఇటలీ పౌరుల వైద్య ఖర్చులను మాఫీ చేసిన స్విట్జర్లాండ్

అవయవ మార్పిడిలో నెల్లూరు అపోలో సరికొత్త రికార్డు: ఒకే నెలలో 8 శస్త్రచికిత్సలు, అరుదైన ఘనతలు

Select Suryaa Now
అవయవ మార్పిడిలో నెల్లూరు అపోలో సరికొత్త రికార్డు: ఒకే నెలలో 8 శస్త్రచికిత్సలు, అరుదైన ఘనతలు

నెల్లూరు,  కల్చరల్,  మేజర్ న్యూస్  :   నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ అవయవ మార్పిడి చికిత్సల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రాంతీయ వైద్యరంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమించింది. అక్టోబర్ నెలలోనే రికార్డు స్థాయిలో 6 కిడ్నీ మార్పిడి, 2 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో భాగంగా నెల్లూరులోనే తొలిసారిగా బ్రెయిన్ డెడ్ అయిన దాత నుంచి సేకరించిన కాలేయాన్ని విజయవంతంగా అమర్చడమే కాకుండా, రాయలసీమ ప్రాంతంలోనే మొదటిసారిగా ఒకే రోగికి కాలేయం, కిడ్నీ రెండింటినీ మార్పిడి చేసే అత్యంత సంక్లిష్టమైన బహుళ అవయవ మార్పిడిని చేపట్టి అరుదైన మైలురాయిని నమోదు చేసింది.
ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఏ.కె.చక్రవర్తి, యూనిట్ హెడ్ విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు ఈ విజయానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. నెఫ్రాలజీ, యూరాలజీ, లివర్ ట్రాన్స్‌ప్లాంట్, అనస్థీషియా, క్రిటికల్ కేర్, నర్సింగ్ విభాగాల సమష్టి సమన్వయంతోనే శస్త్రచికిత్స అనంతర సంరక్షణతో కూడిన ఈ సంక్లిష్ట ప్రక్రియలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు.