BREAKING
జనసేన పార్టీ ఉత్తరం సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్ మర్యాదపూర్వం కలిసిన ఆళ్ల షణ్ముఖేశ్వరి ఓటీటీలోకి వచ్చేస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్ 'బా బా బ్లాక్ షీప్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఆరోగ్యశాఖ స్టేట్ కమిటీ ప్రతినిధులతో సమావేశం అంతర్జాతీయ స్థాయిలో విస్తరిస్తున్న భారత్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ సర్ లో ఓట్లు కోల్పోయిన 13 కోట్ల మందికి రేషన్, పింఛను కట్ * కేంద్ర మంత్రి ప్రకటనతో బయటపడ్డ మోడీ కుట్ర * రాష్ట్రస్థాయి పోటీలకి ఎంపికైన విద్యార్థి వార్వాళ్ళ అరుణ్ కుమార్ నేపాల్‌లో పర్యటిస్తున్న భారత విదేశీ కార్యదర్శి విక్రమ్ మిస్రి పల్లెపోరు నేడే * 27 జెడ్పీటీసీ, 437 ఎంపీటీసీలకు ఎన్నికలు * జాతీయ జంప్ రోప్ పోటీల్లో రైన్‌బో విద్యార్థుల గ్రిడ్ స్థాయి విద్యుత్ నిల్వ సామర్థ్య పెంపుకు భారీ కేటాయింపు బరిలో నలుగురు.. గెలిచేదెవరు? ఆ ఇద్దరి మధ్యే తీవ్ర పోరు! దేశీయంగా లిథియం, నికెల్ శుద్ధి సామర్థ్యం పెంపు నా జీవితంలో అత్యంత భయానక రాత్రి అదే.. కత్తిపోట్ల ఘటనపై సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం రూ.3,788 కోట్లు కేటాయించిన కేబినెట్ పరిషత్ పోరుకు అంతా రెడీ... *ఉదయం 7 నుంచి పోలింగ్ *

గ్రామ వికాసానికి నాబార్డ్ నిధులు..

Select Suryaa Now
గ్రామ వికాసానికి నాబార్డ్ నిధులు..

సూర్య తాడ్వాయి :తాడ్వాయి మండలం దేనికలాన్ గ్రామానికి నాబార్డ్ (NABARD) సంస్థ ద్వారా ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల మౌలిక సదుపాయాల కల్పన, పాఠశాలల ఆధునీకరణే ధ్యేయంగా నాబార్డ్ ఈ నిధులను మంజూరు చేసింది. ఈ శుభపరిణామాన్ని పురస్కరించుకుని దేనికలాన్ గ్రామస్తులు, పాఠశాల విద్యార్థులు బుధవారం నాడు పెద్ద13 లక్షల 55 వేలు నిధులు మంజూరు చేసినందుకుగాను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు  చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా.. నిధుల మంజూరుకు కృషి గ్రామస్థులు మరియు విద్యార్థులు ఉమ్మడిగా పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా  గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. "చాలా కాలంగా మా గ్రామంలో సరైన మౌలిక వసతులు, పాఠశాలలో ఆధునిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు నాబార్డ్ నిధులు మంజూరు కావడం వల్ల డిజిటల్ తరగతులు, తాగునీరు, గ్రంథాలయ వసతులు సమకూరనున్నాయి" అని ఆనందం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపుతో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ భైరవి రాజిరెడ్డి , ఉప సర్పంచ్ గంగయ్య సేటు , గ్రామ కమిటీ అధ్యక్షులు గడ్డ బాలరాజు గారు, మండలాధ్యక్షులు బండారి సంజీవులు మరియు పిఎసిఎస్ చైర్మన్ సుధాకర్ రావు గారు, రాజలింగం, సిద్ధిరాములు, శ్రీకాంత్, రమేష్, అఖిల్ రావు, మల్లేశం, బీరయ్య చందు, శ్రీకాంత్, మహేందర్, సాయ గౌడ్ మరియు  గ్రామస్థాయి నాయకులు పాల్గొన్నారు.