BREAKING
ఢిల్లీ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య: 3 పేజీల లేఖ లభ్యం పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన ఎన్విడియాతో భాగస్వామ్యాన్ని విస్తరించిన బాక్స్ ఎం&ఎం క్యూ2 లాభం 25% జంప్: రూ. 4,588 కోట్లు దీపావళి వేడుకలు: చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు 77.33% నమోదైన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు.

సర్ లో ఓట్లు కోల్పోయిన 13 కోట్ల మందికి రేషన్, పింఛను కట్ * కేంద్ర మంత్రి ప్రకటనతో బయటపడ్డ మోడీ కుట్ర *

Select Suryaa Now
సర్ లో ఓట్లు కోల్పోయిన 13 కోట్ల మందికి రేషన్, పింఛను కట్   * కేంద్ర మంత్రి ప్రకటనతో బయటపడ్డ మోడీ కుట్ర *

 సీతమ్మధార, సూర్య : దేశంలో సర్ ద్వారా 13 కోట్ల ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఓట్లు తొలగింపు బిజెపి గెలుపు కోసమే కాదు వారికి శాశ్వతంగా సంక్షేమ పథకాలను రద్దు చేయడానికే నని అందుకే ముందుగా కోట్ల కొలది ఓట్లు తీసేసి సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు బడులు ఓటర్  కార్డు లింక్ చేస్తున్నారని విదసం ఐక్య వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బూసి వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు. పౌరుడికి ఆధార్ కార్డు లింక్ తీసేసి ఓటర్ కార్డు లింక్ చేస్తే ఓట్లు పోయిన 13 కోట్ల మంది పేదలు,ఎస్సీ ఎస్టీలు , మైనారిటీలకు కనీసం రేషన్ బియ్యం కూడా అందవని ఆధార్ కార్డు బదులు ఓటర్ కార్డు లింకేజి ను అంగీకరించే ప్రసక్తే లేదని  వెంకట రావు పత్రికా ప్రకటన లో హెచ్చరించారు.  పేదల సంక్షేమ పథకాల చెల్లింపులుకు  ఆధార్ కార్డు  కాకుండా ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ ఆధారంగా చెల్లిస్తామని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ నిన్న ఆ శాఖ అధికారుల శిక్షణా శిబిరంలో ప్రకటించారని ఆ వార్త క్లిప్పింగ్ ను ఈ ప్రకటనకు జత చేశారు. మంత్రి  ప్రకటన పై వెంకట రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్ లో ఓట్లు కోల్పోయిన 13 కోట్లు మంది  ఓటు పోతే  పోయింది బతకడానికి రేషన్, పింఛను రైతు భరోసా ఇస్తారు కదా ఆధార్ ఉంది కాదా అని సరిపెట్టుకున్న పేదలకు మంత్రి  ప్రకటన పెద్ద దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.. మంత్రి  ప్రకటన ప్రకారం రేపటినుండి ప్రభుత్వ పథకాలకు ఆధార్ కట్.. ఓటర్ కార్డు ఉంటేనే పింఛను, కిసాన్ బరోసా, విద్యార్దులు స్కాలర్ షిప్, ఎస్సీ ఎస్టీ లకు ఇచ్చే జాతీయ సామాజిక కార్పొరేషన్ రుణాల కు అర్హులన్నారు.. పథకాలకు ఓటర్ ఐడి ఎపిక్ నంబర్ లింక్ చేస్తామంటే  వారికి బతికే హక్కు లేకుండా  సంక్షేమ పథకాలను రద్దు చేసే కుట్ర దాగి ఉందన్నారు. ఈ 13 కోట్ల మందే కాదు ఓటు వయసుకు రాని 18 ఏళ్ల లోపు విద్యార్థులకు స్కాలర్ షిప్పుల సంగతేమిటని ప్రశ్నించారు.  రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు అమలు చేసే అన్ని రకాల సంక్షేమ పథకాలకు కేంద్రం వాటా చెల్లిస్తుందని మరి ఆ నిధులు ఓటర్ కార్డు తో ముడి పెట్టీ నిధులు ఎగవేస్తే డబుల్ ఇంజన్ సర్కారు ఇంజను సైతం మూలకు చేరుతుందన్నారు.. రూపాయ బియ్యం, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళల సామాజిక పింఛన్లు, ఎన్ ఎస్ ఎఫ్ డీ సి రుణాలు, అన్నిటికి కోట్ల మందిని అనర్హులను చేసి సంక్షేమ పథకాలు ఎగ్గొట్టి ఆ డబ్బులు అదానీ, అంబానీలకు  రాయితీలుగా ఇవ్వడానికే ఈ కుట్రలు అని దుయ్యబట్టారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కేవలం గెలుపు ఓటములే బేరీజు వేసుకోకుండా ప్రజల కష్టాలపై మాట్లాడాలని హితవు పలికారు.