BREAKING
వాల్ స్ట్రీట్‌లో చిప్ షేర్ల భారీ పతనం ఆళ్లగడ్డ జడ్పిటిసిగా విజయం సాధిస్తా. జడ్పిటిసి తెదేపా అభ్యర్థి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి చీపురుపల్లిలో 74.49 శాతం పోలింగ్ భారత్-శ్రీలంక తొలి వన్డే వేదిక మార్పు: ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి తరలింపు ఢిల్లీ స్కూల్లో విద్యార్థిని ఆత్మహత్య: 3 పేజీల లేఖ లభ్యం పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ * టాటా ట్రస్ట్స్ వివాదం: వాయిదా కోరిన ఎస్‌ఆర్‌టీటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం హెల్ప్‌డెస్క్ ప్రారంభం అత్యాచార కేసులో దోషిగా నిర్ధారణ అయిన ప్రముఖ హాస్యనటుడు రస్సెల్ బ్రాండ్ పరాగ్వే రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత ఓల్డ్ మాంక్ వివాదం: పిటిషన్ వెనక్కి తీసుకున్న రమ్ తయారీదారు పరిషత్ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కాగిత దంపతులు. కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. * కొత్తూరు పోలింగ్ కేంద్రం లో పోలీస్ లాఠి చార్జ్ * మూడో త్రైమాసికంలో 1 శాతం వృద్ధిని నమోదు చేసిన రష్యా జిడిపి నార్తర్న్ ఆర్క్ రికార్డు లాభాలు: సీఈఓ కీలక ప్రకటన

పల్లెపోరు నేడే * 27 జెడ్పీటీసీ, 437 ఎంపీటీసీలకు ఎన్నికలు *

Select Suryaa Now
పల్లెపోరు నేడే      * 27 జెడ్పీటీసీ, 437 ఎంపీటీసీలకు ఎన్నికలు *

విజయనగరం బ్యూరో, సూర్య : జిల్లాలో పల్లెపోరుకు సర్వం సిద్ధమైంది. 27 జెడ్పీటీసీ, 437 ఎంపీటీసీ స్దానాలకు గురువారం పోలింగుకు రంగం సిద్ధమైంది. అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇందుకోసం 1685 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5వరకు పోలింగు జరుగుతుంది. జెడ్పీ చైర్మన్, ఎంపీపీ పదవులకు తొలుత పట్టణ స్థానిక ఎన్నికల మాదిరిగానే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత  ప్రతిపాదనను విరమించుకొని పరోక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. జెడ్పీ చైర్మన్ పదవిని జెడ్పీటీసీలు, ఎంపీపీలను ఎంపీటీసీలు  ఎన్నుకోనున్నందున ఈ ఎన్నికలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
ప్రధానంగా జెడ్పీ పీఠంపై టీడీపీ, వైసీపీ గురిపెట్టడమే కాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బొత్స సత్యనారాయణ తన పరివారాన్ని నాలుగుచోట్ల మోహరించారు. గరివిడి నుంచి కోడలు పూజిత, బొండపల్లి నుంచి కుమార్తె అనూష, గుర్ల నుంచి సోదరి సంగిరెడ్డి లక్ష్మి, పూసపాటిరేగ నుంచి సోదరుడు లక్ష్మణరావు కుమారుడు చైతన్యను దించారు. వీరిలో చైతన్య నామినేషన్ తిరస్కరణకు గురవగా, మిగతా ముగ్గురు ప్రచారాన్ని హోరెత్తించారు. టీడీపీ నుంచి జెడ్పీ చైర్మన్ సీటు ఆశిస్తున్న చిన్నశ్రీను కుమార్తె సిరిసహస్ర అంతకుమించి అన్నట్టుగా ప్రచారంలో దూసుకుపోయారు. మిగిలిన అన్నిచోట్లా కూడా నువ్వానేనా స్థాయిలో పోరు కనిపించింది. ఇంకోవైపు, ఎంపీపీ పదవుల ఆశావహులు కూడా తమ గెలుపుకోసం తాపత్రయపడుతూనే, మెజారిటీ ఎంపీటీసీల గెలుపు బాధ్యతలను భుజాన వేసుకోకతప్పలేదు.
ఈ క్రమంలో పరిషత్ పోరు నీ పెతాపమా, నా పెతాపమా స్థాయిలో పల్లెసీమలను వేడెక్కించింది. రెండుపార్టీల లక్ష్యం జెడ్పీ చైర్మన్, మెజారిటీ ఎంపీపీ పదవులే అయినందున తగ్గేదేలే అన్నట్టుగా హోరాహోరీ వాతావరణాన్ని సృష్టించాయి. పరోక్ష ఎన్నికలు కావడం, జెడ్పీ ఎన్నికలను రెండుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఎంపీటీసీ అభ్యర్థుల ఖర్చులో మూడొంతులవరకు ఎంపీపీ ఆశావహులు, జెడ్పీ చైర్మన్ ఆశావహులు భరించడంతో ఎంపీటీసీ అభ్యర్థులకు ఖర్చు తగ్గి ఊపిరి పీల్చుకున్నారు. నేడు పోలింగు దృష్ట్యా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. పురపోరు ప్రశాంతంగా నిర్వహించిన పోలీసు అధికారులు, అదే స్ఫూర్తితో వీటిని కూడా నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. మొత్తమ్మీద, ఈ ఎన్నికలను టీడీపీ, వైసీపీ నువ్వానేనా రేంజులో తీసుకున్న నేపథ్యంలో అందరి దృష్టి పోలింగు శాతం పెంపుపైనే ఉంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి చిత్రవిచిత్ర విన్యాసాలు తెరపైకి తెచ్చిన పార్టీల అభ్యర్థులు, వారిని పోలింగు బూత్ కు రప్పించే పనిలో నిమగ్నమయ్యారు.