కామారెడ్డి జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.
సూర్య కామారెడ్డి, ప్రతినిధి :కామారెడ్డి జిల్లాలోని మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తుంది. జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారని జూనియర్ విద్యార్థులు నేషనల్ మెడికల్ కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదుతో అధికారులు విచారణ చేపట్టారు. మెడికల్ కళాశాలలో చదువుతున్న సీనియర్ విద్యార్థులు 14 మంది జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసినట్లు గుర్తించారు. వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నలుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెన్షన్ చేశారు.
పదిమంది విద్యార్థులను నాలుగు నెలల పాటు సస్పెన్షన్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడడం కలకలం సృష్టిస్తుంది. ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో 14 మంది విద్యార్థులు ర్యాగింగ్ చేయడం కలకలం సృష్టిస్తుంది. జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడ్డారని బాధితులు నేషనల్ మెడికల్ కమిషన్కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి విచారణ చేపట్టారు. ర్యాగింగ్ కు పాల్పడిన 14 మంది విద్యార్థులను గుర్తించారు.
వారిపై చర్యలు చేపట్టారు.వీరిలో నలుగురు విద్యార్థులను ఆరు నెలల పాటు సస్పెన్షన్ చేయగా, మరో 10 మంది విద్యార్థులను నాలుగు నెలల పాటు సస్పెన్షన్ చేశారు. ర్యాగింగ్ జరగకుండా పోలీసులు ఒకవైపు అవగాహన సదస్సు లు పెట్టినా కూడా ర్యాగింగ్ భూతం విడడం లేదని అనడానికి కామారెడ్డి మెడికల్ కళాశాలలో వెలుగులోకి వచ్చిన ర్యాగింగ్ ఘటన కలకలం సృష్టిస్తుంది. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ జరగడంతో అధికారులు సీరియస్ తీసుకుంటున్నారు.గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాగింగ్ ను అరికట్టేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి కళాశాల పాఠశాలలో విద్యార్థులకు ర్యాగింగ్ పై అవగాహన కల్పించారు. ర్యాగించే పడితే తీసుకునే చర్యలను వివరించారు. కొంత ర్యాగింగ్ భూతం సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో కామారెడ్డి జిల్లాలో ఈ ఘటన కలకలం రేపుతుంది. కామారెడ్డి మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేయడం తో మరోసారి ర్యాగింగ్ ఆనవాళ్లు తొలిగిపోలేదని స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ర్యాగింగ్ ను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిన విషయం విధితమే.