BREAKING
అవయవ మార్పిడిలో నెల్లూరు అపోలో సరికొత్త రికార్డు: ఒకే నెలలో 8 శస్త్రచికిత్సలు, అరుదైన ఘనతలు మురికికూపంగా రహదారి: కస్తూర్బా హాస్టల్ సమస్యపై ఎమ్‌ఎల్‌ఏ డాక్టర్ కవ్వంపల్లి పరిశీలన బీద రవిచంద్ర ను కలిసిన రూప్ కుమార్ యాదవ్ ఆసిఫ్ అమ్మ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా విజేత షేక్ షాహిదాకు ఘన సన్మానం బరేలీ కీ బర్ఫీ జ్ఞాపకాలను గుర్తుచేసిన ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు.. దీపావళి పార్టీలో జోరుగా స్టెప్పులు ఆత్మీయ సమ్మేళనానికి దూరంగా కాంగ్రెస్ సర్పంచులు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి తమిళనాడులో థియేటర్ల యజమానులకు దీపావళి కానుక.. కొత్త సినిమాలకు రోజుకు ఆరు షోల వెసులుబాటు దర్శి జడ్పిటిసి జనసేన అభ్యర్థి లక్ష్మీ తాయారును అఖండ మెజార్టీతో గెలిపించాలి. కంటి చూపు కోసం గాయకుడు సునీల్ లోధీ కీలక అడుగు.. భావోద్వేగ పోస్ట్ వైరల్ ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు. కంబదూరు ఎస్సై లోకేష్. 2024-25లో 9.28 శాతానికి చేరిన కార్పొరేట్ జీవీఏ వృద్ధి

మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ గా వై.వి గౌడ్

Select Suryaa Now
మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ గా వై.వి గౌడ్

*మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ గా వై.వి గౌడ్*

మాడ్గుల (రంగారెడ్డి)
మాడ్గుల మండల సింగిల్ విండో చైర్మన్ గా దివంగత కేంద్ర మాజీ మంత్రి , ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహిత సూధిని జైపాల్ రెడ్డి ప్రియశిష్యులు, డి.సి.సి అధికార ప్రతినిధి, సుద్ధపల్లి మాజీ సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ నియమితులైనట్లు విశ్వసణీయసమాచారం. మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు గా, రెండు పర్యాయాలు సుద్ధపల్లి సర్పంచ్ గా, డిసిసి ఉపాధ్యక్షులు గా వెంకటేశ్వర్లు గౌడ్ ప్రజలు, పార్టీకి అందిన సేవలు గుర్తించి కాంగ్రెస్ అధిష్టానం ఆయనను పిఏసిఎస్ అధ్యక్షులు గా నియమించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవలే తెలంగాణ గ్రామపంచాయతి ట్రిబ్యునల్ చైర్మన్ సూధిని రాంరెడ్డి, మాడ్గుల మండల కాంగ్రెస్ అధ్యక్షులు భట్టు కిషన్ రెడ్డి, మండల కాంగ్రెస్ ముఖ్యనాయకులతో నిర్వహించిన సమావేశంలో మాడ్గుల సింగిల్ విండో చైర్మన్ గా యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ తో పాటు వైస్ చైర్మన్, డైరెక్టర్ల పేర్లతో కూడిన లిస్టును సెక్రటేరియట్ కు సంబంధిత అధికారుల ఆమోదం కొరకు పంపినట్లు సమాచారం. కాగా నేడో రేపో మాడ్గుల సింగిల్ విండొ చైర్మన్, పాలకవర్గసభ్యుల పేర్లతో కూడిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం వున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
-------
ఆర్.నర్సింహ్మ, మేజర్ న్యూస్ : మాడ్గుల