BREAKING
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఉయ్యూరు అభివృద్ధికి కృషి చేయాలి గొర్తి శ్రీనివాస్ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి కోలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇవ్వనున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌: తమిళ చిత్రంలో విలన్‌గా అరంగేట్రం

బరిలో నలుగురు.. గెలిచేదెవరు? ఆ ఇద్దరి మధ్యే తీవ్ర పోరు!

Select Suryaa Now
బరిలో నలుగురు.. గెలిచేదెవరు?  ఆ ఇద్దరి మధ్యే తీవ్ర పోరు!

గుర్ల, సూర్య : గుర్ల మండలంలో జడ్పీటీసీ ఎన్నికల బరిలో నలుగురు అభ్యర్థులు నిలిచినప్పటికీ, విజయం ఎవరిని వరిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. నేడు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు హక్కుతో అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న విపక్ష నేత బొత్స సత్యనారాయణ సోదరి సంగం రెడ్డి వెంకటలక్ష్మి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. తనదైన వాగ్ధాటితో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఆమెకు మద్దతుగా మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అన్న బొత్స సత్యనారాయణ, మేనకోడలు బొత్స అనూష ఎన్నికల ప్రచార సమావేశాల్లో పాల్గొనడం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ పరిణామాలు తమ అభ్యర్థి విజయానికి దోహదపడతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చనమల్ల రాధ కూడా తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఆమె భర్త చనమల మహేష్‌తో పాటు మండల పార్టీ నాయకులు గ్రామగ్రామాన పర్యటిస్తూ సమావేశాలు నిర్వహించి ఓటర్లను కలిశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆదరణ, పార్టీ క్యాడర్ మద్దతు తమకు అనుకూలంగా మారుతాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు నిర్వహించిన ప్రచారం కూడా తమ అభ్యర్థి విజయానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు.

ఇదిలా ఉండగా జనసేన పార్టీ తరఫున కంది దీపిక జడ్పీటీసీ బరిలో నిలిచారు. అయితే కూటమి తరఫున ఉమ్మడి అభ్యర్థి ఖరారు కాకపోవడంతో టీడీపీ, జనసేన అభ్యర్థులు వేర్వేరుగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి చనమల్ల రాధకు జనసేన ఓట్లు మద్దతుగా నిలవాలని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గ జనసేన నాయకుడు విసనగిరి శ్రీనివాసరావు సైతం జనసేన కార్యకర్తలు కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని అధిష్టానం కోరిక మేరకే నేను పిలుపునిస్తున్నానని సమావేశాల్లో పేర్కొన్నారు. పొరపాటు జరిగిందని సరిదిద్దడానికి చేసిన ప్రచారం ఏమేరకు పనిచేస్తుందో నన్న ప్రశ్న జనసేన ఓటర్లు ఏ మేరకు ఆ దిశగా మొగ్గుచూపుతారన్నది ఫలితాల్లో తేలనుంది.

బ్యాలెట్‌పై గాజు గ్లాసు గుర్తు ఉన్నప్పటికీ, జనసేన అభ్యర్థి ప్రచారం నిర్వహించలేదు దీంతో టీడీపీ అభ్యర్థికి ఎంతవరకు కలిసివస్తుందో చూడాలి.

ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున పతివాడ లక్ష్మి జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే పార్టీ శ్రేణుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రచార సహకారం అందకపోవడంతో ఆమె ప్రచారం అంతగా కనిపించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటర్లు ఏ మేరకు మద్దతు పలుకుతారన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే నెలకొన్నట్లు రాజకీయ వర్గాల అంచనా. జనసేన ఓట్ల ప్రభావం, కాంగ్రెస్ అభ్యర్థికి లభించే మద్దతు కూడా ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది. నేటి పోలింగ్‌తో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానుంది. ఈ నెల 7వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరన్నది తేలనుంది.