ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది
మున్సిపాలిటీ కి రెండు విడతలలో 1000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ లకు సంబంధం లేకుండా అభివృద్ది చేస్తున్నాము
మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది
సూర్యాపేట
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని 45వ వార్డు విద్యా నగర్ లో ఐదు లక్షల వ్యయంతో నిర్మాణం చేయనున్న సిసి రోడ్డు నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు విడతలలో 1000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం పట్ల పట్టణంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇందుకు సహకరించిన *జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎఐ సిసి సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ మాజి చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డిలకు* ధన్యవాదాలు తెలియజేశారు. నాయకుల సూచనలతో తాము అభివృద్ధి పథకాలను పేదలకు అందజేస్తున్నామని ఇందులో ఎటువంటి పక్షపాతం గాని వివక్షగాని లేవని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు గాని తర్వాత పార్టీలకు సంబంధం లేకుండా అభివృద్ధి చేస్తామని అన్నారు. బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డులో కూడా తాము అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. 45 వ వార్డులో రోడ్డు సమస్య ఉందని తనకు అక్కడి ప్రజలు ఫోన్ చేయగానే వెంటనే రోడ్డు రిపేర్ చేయించడం జరిగిందని ఆమె అన్నారు. సూర్యాపేట పట్టణంలో దాదాపు 3500 మంది పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారని వారిలో అర్హులైన అందరికి పెన్షన్ ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫి వుల్లా, ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణానికి 1000 ఇందిరమ్మ ఇళ్ల ను తీసుకొని వచ్చిన మున్సిపల్ చైర్మన్ కు అభినందనలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లాడుతూ మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అభినందనలు తెలిపారు. తమ వార్డులో ఏ సమస్య ఉన్నా చెప్పగానే వెంటనే పరిష్కారం చేస్తున్నారని తమకు సహకరిస్తున్న చైర్ పర్సన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం లో బిఆర్ ఎస్ పార్టి ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున, నాయకులు సవరాల సత్యనారాయణ, నరేంద్రుని హరీష్, వెంపటి మనోహర్, మున్సిపల్ డి ఇ ప్రణయ్ రెడ్డి, ఎ ఇ తిరుమలయ్య, జవాను కొండేటి వెంకన్న, వార్డు ప్రముఖులు పాల్గొన్నారు