35వ డివిజన్‌లో రెండోసారి ఘన విజయం సాధించిన ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 35వ డివిజన్‌లో రెండోసారి ఘన విజయం సాధించిన కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి మర్యాదపూర్వకంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలను కలిశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి సోదరులు ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డిని అభినందించారు. ప్రజలు మరోసారి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఇకముందు కూడా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పడారుపల్లి సబ్బన్న, కనుపర్తిపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ, సుధాకర్, నన్నం శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.