BREAKING
ఓటీటీలోకి ప్రియమణి, అర్జున్ రాంపాల్ క్రైమ్ థ్రిల్లర్.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా చూసేయొచ్చు కావలి ఆర్టీసీ డిపోలో ఘనంగా బ్రిక్స్ సుస్థిర జీవన శైలి వారోత్సవాలు 'రామాయణ' సినిమా స్థాయిని పెంచిన హాలీవుడ్ యాక్షన్ కోచ్ టెర్రీ నోటరీ: కునాల్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్టీఆర్ జిల్లాలో కూటమి విజయదుందుభి.. ఎంపీ కేశినేని చిన్ని కార్యాలయంలో సంబరాలు అవయవ మార్పిడిలో నెల్లూరు అపోలో సరికొత్త రికార్డు: ఒకే నెలలో 8 శస్త్రచికిత్సలు, అరుదైన ఘనతలు మురికికూపంగా రహదారి: కస్తూర్బా హాస్టల్ సమస్యపై ఎమ్‌ఎల్‌ఏ డాక్టర్ కవ్వంపల్లి పరిశీలన బీద రవిచంద్ర ను కలిసిన రూప్ కుమార్ యాదవ్ ఆసిఫ్ అమ్మ ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆసియా విజేత షేక్ షాహిదాకు ఘన సన్మానం బరేలీ కీ బర్ఫీ జ్ఞాపకాలను గుర్తుచేసిన ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు.. దీపావళి పార్టీలో జోరుగా స్టెప్పులు ఆత్మీయ సమ్మేళనానికి దూరంగా కాంగ్రెస్ సర్పంచులు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలి. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి* ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి తమిళనాడులో థియేటర్ల యజమానులకు దీపావళి కానుక.. కొత్త సినిమాలకు రోజుకు ఆరు షోల వెసులుబాటు

ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.వి.ఆర్..

Select Suryaa Now
ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలి: బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కె.వి.ఆర్..

ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన పట్టభద్రులు తమ ఓటును వెంటనే నమోదు చేసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల . వెంకట్ రెడ్డి   ఒక ప్రకటనలో కోరారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6, 2026 చివరి తేదీ కావడంతో పట్టభద్రులు నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. చింతపల్లి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో నివసిస్తున్న, 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులు ఫారం-18 ద్వారా తమ ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, సరైన నాయకులను ఎన్నుకోవడం ద్వారా సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
నవంబర్ 6తో గడువు ముగియనున్న నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులు వెంటనే ఓటరు నమోదును పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు..