BREAKING
ఒకే దెబ్బకు రెండు ప్రపంచ రికార్డులు.. సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ లిథియం, నికెల్ ప్రాసెసింగ్‌కు రూ. 2,814 కోట్లు కావేరి హాస్పిటల్ ఆధ్వర్యంలో ‘సమత్వ’ ఆవిష్కరణ పెద్దపంజాణి మండలంలో 45,284 మంది ఓటర్లు - పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం ఆత్మకూరులో క్రికెట్ టోర్నమెంట్స్ క్రికెట్ చరిత్రలో సంచలనం.. తొలి ఆరు ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన బ్యాటర్ బ్రిటన్ సుప్రీంకోర్టులో 'పాలస్తీనా యాక్షన్' నిషేధంపై విచారణ ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. డి.ఎస్.పి దైవప్రసాద్. ఉత్తరాఖండ్ ట్రెక్కింగ్ ప్రమాదం: ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి పోలింగ్‌కు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ కేసులు ఇటలీ పౌరుల వైద్య ఖర్చులను మాఫీ చేసిన స్విట్జర్లాండ్ పీవీ సింధు అరుదైన ఘనత.. ఏళ్ల తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత చక్రపాణి సేవలు చిరస్మరణీయం శాసన మండలి మాజీ చైర్మన్ మృతిపై ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపం ఎతిసలాత్ బకాయిలపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు పాక్ యూరోపియన్ యూనియన్‌లో చేరికకు ఉక్రెయిన్ వేగంగా సంస్కరణలు చేపట్టాలి

కావలి ఆర్టీసీ డిపోలో ఘనంగా బ్రిక్స్ సుస్థిర జీవన శైలి వారోత్సవాలు

Select Suryaa Now
కావలి ఆర్టీసీ డిపోలో ఘనంగా బ్రిక్స్ సుస్థిర జీవన శైలి వారోత్సవాలు

కావలి, మేజర్ న్యూస్ :  పర్యావరణహిత అలవాట్లతోనే ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాలు ఏర్పడతాయని 3160 రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ నామినీ డాక్టర్ కే. మాధవరెడ్డి పేర్కొన్నారు. బ్రిక్స్ సుస్థిర జీవన శైలి వారోత్సవాలలో భాగంగా బుధవారం 4వ రోజు కార్యక్రమంగా ఏపీఎస్‌ఆర్టీసీ కావలి గ్యారేజ్‌లో "సుస్థిర ఆహార వ్యవస్థలు - ఆరోగ్యవంతమైన ప్రజలు, పచ్చని భవిష్యత్తు" అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కావలి డిపో మేనేజర్ డి. ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా, వక్తగా విచ్చేసి దిశానిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా డాక్టర్ మాధవరెడ్డి మాట్లాడుతూ, స్థిరమైన ఆహార వ్యవస్థను అలవర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా పర్యావరణాన్ని, భూమిని కాపాడుకోవచ్చని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో కొన్ని కీలక మార్పులు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఆహారపు అలవాట్లలో పాటించాల్సిన ముఖ్యమైన సూచనలను ఆయన వివరించారు.
 మన ప్రాంతంలో పండే కూరగాయలు, పండ్లను కొనుగోలు చేయడం వల్ల రవాణా ఖర్చులు, కాలుష్యం తగ్గుతాయి. ఆయా కాలాల్లో సహజంగా లభించే పండ్ల ద్వారా నాణ్యమైన పోషకాలు అందుతాయి.
రెడ్‌ మీట్ (గొర్రె, పంది మాంసం మొదలైనవి) ఉత్పత్తికి ఎక్కువ నీరు, భూమి అవసరమవుతాయి. కాబట్టి మాంసాహారాన్ని పరిమితం చేసి, పప్పుధాన్యాలు, గింజలు, సోయా వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.   వారానికి సరిపడా మెనూని ముందే ప్లాన్ చేసుకుని, అవసరమైన మేరకు మాత్రమే సరుకులు కొనాలి. మిగిలిపోయిన ఆహారాన్ని వృథా చేయకుండా భద్రపరుచుకుని మరుసటి రోజు ఉపయోగించుకోవాలి.   కూరగాయల తొక్కలు వంటి వంటగది వ్యర్థాలను పారేయకుండా ఇంట్లోనే మొక్కలకు ఎరువుగా మార్చుకోవాలి. పురుగుల మందులు, కృత్రిమ ఎరువులు లేకుండా పండించే సేంద్రీయ ఉత్పత్తులను ఎంచుకోవాలి. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి తృణధాన్యాల సాగుకు తక్కువ నీరు సరిపోతుంది. ఇవి పర్యావరణానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  మార్కెట్‌కు వెళ్లేటప్పుడు బట్ట సంచులు లేదా జనపనార సంచులను తీసుకెళ్లాలి. ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసిన వస్తువుల కంటే విడిగా దొరికే వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని మాధవరెడ్డి అంశాల వారీగా  పేర్కొన్నారు.  డిపో మేనేజర్ డి. ఆదినారాయణ అధ్యక్షోపన్యాసంలో మాట్లాడుతూ.. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల సందర్భంగా చర్చిస్తున్న ఈ అంశాలు పర్యావరణ పరిరక్షణకు, భవిష్యత్ తరాల మనుగడకు ఎంతో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.  కావలి డిపోకు చెందిన ఆఫీస్ సిబ్బంది, గ్యారేజ్ సిబ్బంది, వాషింగ్, క్లీనింగ్ ఒప్పంద కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు, ట్రాఫిక్ సూపర్‌వైజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డాక్టర్ కే. మాధవరెడ్డి ఉపన్యాసం సిబ్బందిని ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం సదస్సులో పాల్గొన్న వారందరితోనూ సుస్థిర ఆహార వ్యవస్థలను అలవర్చుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు.  ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) ఎస్.కె. ఖాజా మొహిద్దీన్, ట్రాఫిక్ సూపరింటెండెంట్ ఎం. రామకృష్ణ, డిప్యూటీ సూపరింటెండెంట్ (ఆఫీస్) జి. శ్రీనివాసులు, అకౌంట్స్ సూపరింటెండెంట్ ఇ.డి.వి. ప్రసాద్, బస్టేషన్ సూపర్‌వైజర్ డి. రవిప్రకాష్, మెకానికల్ సూపర్‌వైజర్ నజీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.