BREAKING
జెడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికల కు అంతా సిద్ధం ఎన్నికలు ప్రశాంత నిర్వహణకు సిబ్బంది కి ధన్యవాదాలు చందుపట్ల గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వైసీపీ కంచుకోటలో కమలం పాగా .... ఎన్నికలకు సర్వం సిద్ధం! అమెరికాలో తొలి ముస్లిం సెనేటర్‌గా అబ్దుల్ ఎల్-సయ్యద్ చరిత్ర న్యాయమే గెలిచింది.. నా భర్త గెలిచాడు... రిపబ్లికన్ల ఓటమిపై ఎలాన్ మస్క్ వ్యంగ్య పోస్ట్ *జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ... సిరా చుక్కే.. మండల భవితకు దిక్సూచి! యూఎస్‌లో రెండేళ్ల రాజ్యాంగ ఘర్షణ తప్పదా? రజినీకాంత్ 'ధర్మన్' చిత్రంలోకి యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఎంట్రీ.. నయనతారతో పాటు కీలక పాత్రలో నటి! శబరిమలకు అనిల్ స్వామి మహా పాదయాత్ర ప్రారంభం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం ....ఓటర్లు 49,469, పోలింగ్ 55, కేంద్రాలు పోలింగ్ సిబ్బంది 425 … నాగర్ కర్నూల్ లో గంజాయి తాగుతున్న ఇద్దరు యువకుల పై కేసు నమోదు,, ఎస్ఐ వెంకటరెడ్డి

మూడవ వార్డు బీజేపీ కౌన్సిలర్ నలిశెట్టి శ్రీనివాసులుకు ఘన అభినందనలు

Select Suryaa Now
మూడవ వార్డు బీజేపీ కౌన్సిలర్ నలిశెట్టి శ్రీనివాసులుకు ఘన అభినందనలు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికల్లో మూడవ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన కౌన్సిలర్ నలిశెట్టి శ్రీనివాసులును బుధవారం బిజెపి నాయకులు సన్మానించి అభినందనలు తెలిపారు.బీజేపీ, ఎన్డీఏ కూటమి నాయకులు ఆయనను స్వగృహంలో కలిసి ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయుల రెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని శ్రీనివాసులుకు శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, కరటంపాటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కౌన్సిలర్ శ్రీనివాసులు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీలో తనదైన శైలిలో ప్రజాసేవ చేస్తూ, మూడవ వార్డు అభివృద్ధికి కృషి చేసి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.అనంతరం నలిశెట్టి శ్రీనివాసులు మాట్లాడుతూ మూడవ వార్డులోని సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. తన విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలందరికీ, ముఖ్యంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి  ఆనం రామనారాయణ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  పేరు నిలబెట్టే విధంగా ప్రజలకు సేవ చేస్తానని శ్రీనివాసులు పేర్కొన్నారు.