BREAKING
కొత్త సెన్సార్ బోర్డు నిబంధనలపై ఉత్కంఠ.. చిత్రనిర్మాణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న మేకర్స్ పేదల సొంతింటి కల నిజం చేసిన ప్రజా ప్రభుత్వం దిల్ సే షూటింగ్‌లో ప్రాణాలు కాపాడిన షారుఖ్ ఖాన్.. నటి మీతా వశిష్ట ఆసక్తికర జ్ఞాపకాలు "విజయ్"నగర ఏలిక.... అవనాపు భార్గవి ఇక.... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి - ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలి* *డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి* ఉత్తరాఖండ్‌లో తీవ్రరూపం దాల్చిన కేదార్‌తాల్‌ ట్రెకర్స్ రెస్క్యూ ఆపరేషన్ నేడు మండల జిల్లా ప్రాదేశికఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి. తెల్లవారుజామునే సంచలన పాటను విడుదల చేసిన సల్మాన్ ఖాన్.. యుద్ధ చిత్రంలో ఈ రొమాంటిక్ సాంగ్ ఏంటని అభిమానుల్లో గందరగోళం నన్ను గెలిపించండి... మీ రుణం తీర్చుకుంటా..! రంగారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి మోరీ గేట్ మార్కెట్‌లో 7000 కిలోల కల్తీ కోవా ధ్వంసం.. సీఎం రేఖా గుప్తా నవంబర్ 5న కర్నూలు జిల్లాలోని అన్ని బ్యాంకులకు స్థానిక సెలవు* *జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి* భారత సేవల రంగం..అక్టోబర్‌లో 55.8కి పెరిగిన పీఎంఐ హరికేన్ కట్రినా బాధితుల కోసం హాలీవుడ్ నటి శాండ్రా బుల్లక్ గొప్ప మనసు.. పాఠశాలలో ఉచిత ఆరోగ్య క్లినిక్ ఏర్పాటుకు ఆర్థిక సాయం కండక్టర్ ప్రవళిక మృతికి సంతాపం

ప్రశాంత వాతావరణం లో ఎన్నికల జరిగేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్.

Select Suryaa Now
ప్రశాంత వాతావరణం లో ఎన్నికల జరిగేందుకు ప్రజల సహకరించాలి. రూరల్ సీఐ గంగాధర్.

*కళ్యాణదుర్గం:** ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని కళ్యాణదుర్గం రూరల్ సీఐ గంగాధర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మండల ప్రజలను ఉద్దేశించి ఆయన పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, ఇతరుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, వ్యక్తిగత కక్షలు, వర్గపోరు వంటి అంశాలకు తావివ్వకూడదన్నారు. చిన్నపాటి వివాదాలను కూడా పెద్దవిగా మార్చకుండా సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఎవరైనా గొడవలకు పాల్పడినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా, అవాంఛనీయ సంఘటనలకు కారణమైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఇతరులను రెచ్చగొట్టడం, బెదిరించడం, ఓటర్లను ప్రలోభపెట్టడం వంటి చర్యలకు ఎవరూ పాల్పడకూడదని స్పష్టం చేశారు. ప్రజలు పరస్పర సోదరభావంతో వ్యవహరిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులకు ప్రజలు సహకరించి, ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరగాలని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని ఓటు రూపంలో వ్యక్తం చేయాలని రూరల్ సీఐ గంగాధర్ ఆకాంక్షించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ అన్ని విధాలా చర్యలు చేపడుతోందని, ప్రజల సహకారంతో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.