BREAKING
జనసేనలో చేరిన 15 కుటుంబాలు... బీఈఎల్ టార్గెట్ ప్రైస్ పెంచిన మోతీలాల్ ఓస్వాల్ రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన బీఎస్‌ఈ సంవత్ 2083 దీపావళి స్టాక్ పిక్స్: ఆనంద్ రాఠీ రికమండేషన్స్ రెండవ త్రైమాసికంలో దుమ్మురేపిన అపోలో హాస్పిటల్స్ ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా రాకేష్ వర్రె 'మాయ లేడీ' ట్రైలర్ ఎన్నికల విధుల్లో 11 వేల మంది సిబ్బంది, 3 వేల మంది పోలీసుల నియామకం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల జర్మనీ మార్కెట్‌లో ఎలాన్ మస్క్ టెస్లా హవా రేణిగుంటలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్ల తనిఖీ మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా థియేట్రికల్ హక్కులపై భారీ చర్చ.. రూ. 70 కోట్ల టార్గెట్! నార్త్ అమెరికా కాఫీ యూనిట్‌ను విక్రయించనున్న క్రాఫ్ట్ హేంజ్ ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాలపై ప్రపంచ దేశాల ఉత్కంఠ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'టైసన్ నాయుడు' నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ అప్‌డేట్ ప్రమాద బాధితుడు రమణయ్యను పరామర్శించిన టిడిపి నాయకులు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఊహించని పరిణామం

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి - ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలి* *డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి*

Select Suryaa Now
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి - ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలి*  *డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి*

 

కర్నూలు, నవంబర్ 04: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణలో పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ఎన్నికల కమిషన్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. ఏ. సిరి పోలింగ్ సిబ్బందికి సూచించారు.

బుధవారం  ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి  సి. బెళగల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,  గూడూరు మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల,  కోడుమూరు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో   ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్,  పరిశీలించారు.ఈ సందర్భంగా ఎన్నికల విధులకు హాజరైన అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.  పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు నిర్ణీత సమయానికి చేరుకునేలా  రవాణా ఏర్పాట్లు చేయాలని, బస్సులు, ఇతర వాహనాల ద్వారా సిబ్బంది సకాలంలో గమ్యస్థానాలకు చేరుకునేలా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఎదురైనా, ముఖ్యమైన సమాచారం లేదా మార్పులు చోటుచేసుకున్నా వెంటనే కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బంది నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌కు కంట్రోల్ రూమ్ సిబ్బంది తక్షణమే స్పందించి, అవసరమైన సమాచారం, సహాయ సహకారాలు అందించాలని స్పష్టం చేశారు. రూట్ ఆఫీసర్లు తమకు కేటాయించిన పరిధిలోని పోలింగ్ కేంద్రాలకు సమాన దూరం ఉండేలా రూట్‌లను సమన్వయం చేసుకోవాలని, రూట్ ఆఫీసర్లు, సెక్టోరల్ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, మైనింగ్ శాఖ అధికారి నాగిని, సివిల్ సప్లై డి. ఎం జయంతి, సి. బెలగల్ తహశీల్దార్ వెంకటలక్ష్మి, గూడూరు మండలం తహశీల్దార్ వెంకటేష్ నాయక్,  తదితరులు పాల్గొన్నారు.