కొత్త సెన్సార్ బోర్డు నిబంధనలపై ఉత్కంఠ.. చిత్రనిర్మాణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న మేకర్స్
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: కేంద్ర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) తాజాగా అమల్లోకి తెచ్చిన నూతన నిబంధనలు మరియు మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సినిమా నిర్మాణ రంగంలో పారదర్శకతను పెంచే లక్ష్యంతో సెన్సార్ బోర్డు ఈ సరికొత్త నిబంధనలను తీసుకువచ్చినప్పటికీ, ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకనిర్మాతలు మాత్రం దీనివల్ల ఎదురయ్యే సవాళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలు విడుదలయ్యే సమయానికి ఈ నిబంధనలు పెద్ద అడ్డంకిగా మారుతాయని, నిర్మాణ ప్రక్రియే తలకిందులయ్యే ప్రమాదం ఉందని పలువురు మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం అసంపూర్తిగా ఉన్న సినిమాలను లేదా రఫ్ కట్‌లను సర్టిఫికేషన్ కోసం స్వీకరించబోమని, కేవలం పూర్తయిన చిత్రాలను మాత్రమే సమర్పించాలని బోర్డు స్పష్టం చేసింది. దీనిపై ప్రముఖ దర్శకుడు అమిత్ రాయ్ స్పందిస్తూ, సినిమాటోగ్రఫీ ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, సెన్సార్ అభ్యంతరాల తర్వాత మార్పులు చేయడం అంటే మరోసారి సినిమా తీసినంత భారంగా మారుతుందని వాపోయారు. అంతేకాకుండా సినిమా టైటిల్స్ విషయంలోనూ ముందుగా రిజిస్టర్ చేసుకున్నప్పటికీ, సర్టిఫికేషన్ సమయంలో అభ్యంతరాలు వస్తే పేరు మార్చాల్సి వస్తుందని, ఇది ప్రేక్షకులలో సినిమాపై ఉన్న కనెక్షన్‌ను పూర్తిగా దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
స్వతంత్ర చిత్రాల నిర్మాతల (ఇండిపెండెంటెడ్ సినిమా) పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని మరో దర్శకుడు ఒనిర్ అభిప్రాయపడ్డారు. సెన్సార్ బోర్డు విధానాలు సరళతరం కావాల్సిందిపోయి రోజురోజుకూ మరింత జటిలంగా మారుతున్నాయని ఆయన విమర్శించారు. అయితే మరోవైపు ప్రముఖ దర్శకుడు అహ్మద్ ఖాన్ మాత్రం ఈ విషయంలో కొంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డు నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ, చిత్రపరిశ్రమ అభివృద్ధి కోసం వారు కొన్ని విధివిధానాలను పాటించాల్సి వస్తుందని, మేకర్స్ కూడా మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ట్రేడ్ విశ్లేషకులు మరియు పరిశ్రమ నిపుణులు కూడా టైటిల్స్ మార్పులు మరియు ప్రకటనల విడుదలకు మధ్య సమయం తక్కువగా ఉండటం వల్ల నిర్మాతలు తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత టైటిల్స్ లేదా సీన్లపై అభ్యంతరాలు వస్తే ప్లానింగ్ తలకిందులవుతుందని పేర్కొన్నారు. ఏదేమైనా కేంద్రం తీసుకువచ్చిన ఈ కొత్త సెన్సార్ మార్గదర్శకాలు భవిష్యత్తులో బాక్సాఫీస్ వద్ద సినిమాల విడుదల తీరుతెన్నులను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: దిల్ సే షూటింగ్లో ప్రాణాలు కాపాడిన షారుఖ్ ఖాన్.. నటి మీతా వశిష్ట ఆసక్తికర జ్ఞాపకాలు