BREAKING
జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు సీతారామ భద్ర క్షేత్ర నిర్మాణానికి విరాళాల వెల్లువ వైశ్యులంతా ఐక్యంగా ఉండాలి - జిల్లా సంఘం మాజీ అధ్యక్షులు వంగపల్లి నాగభూషణం గుప్త.. ఏపీలో పారిశ్రామిక క్లస్టర్ ఏర్పాటుకు జపాన్ ఆసక్తి* జాతీయ దత్తత అవగాహన మాసోత్సవం చిన్నారుల తల్లిదండ్రులు సరైన సమయంలో టీకాలు ఇప్పించాలి - కమ్యూనిటీ హెల్త్ అధికారి తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం మదర్ డెయిరీ పాల ధరల పెంపు: రేపటి నుంచే అమలు నేరాల అదుపునకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో ముఖ్యం - ఎస్సై అనిల్ నీరటి కిష్టయ్య నూతన గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న మాజీ సర్పంచుల నేత కె.రాజిరెడ్డి 30వ రోజుకు చేరిన జాతీయ ఆరోగ్య మిషిన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె ఎమ్మిగనూరు వైకాపా జడ్పిటిసి రాజీనామాకు సిద్ధం..? తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ పనుల పరిశీలన పోస్ట్ ఆఫీస్ లో ఉచిత డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల అందజేత ప్రారంభం కామారెడ్డి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి -  MCPI(U)  జిల్లా కార్యదర్శి జబ్బర్ డిమాండ్

మోరీ గేట్ మార్కెట్‌లో 7000 కిలోల కల్తీ కోవా ధ్వంసం.. సీఎం రేఖా గుప్తా

Select Suryaa Now
మోరీ గేట్ మార్కెట్‌లో 7000 కిలోల కల్తీ కోవా ధ్వంసం.. సీఎం రేఖా గుప్తా

సూర్య జాతీయ డెస్క్: పండుగల వేళ ప్రజారోగ్యంతో చెలగాటమాడే కల్తీ రాయుళ్లపై ఢిల్లీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాజధాని నగరం మోరీ గేట్ ప్రాంతంలోని ప్రసిద్ధ కోవా మార్కెట్‌లో ఆహార భద్రతా శాఖ నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో సుమారు 7,000 కిలోల కల్తీ, దుర్వాసన వస్తున్న నాసిరకం కోవాను అధికారులు సీజ్ చేసి అక్కడిక్కడే ధ్వంసం చేశారు. దీపావళి తదితర పండుగల నేపథ్యంలో మార్కెట్లలో కల్తీ మిఠాయిలు, పదార్థాలు విక్రయించకుండా నిరోధించేందుకు ప్రభుత్వం చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా ఈ భారీ ఆపరేషన్ జరిగింది.

ఈ తనిఖీ కార్యాచరణను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. అధికారుల ఆపరేషన్ తీరును సమీక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని తేల్చి చెప్పారు. పండుగల సమయాల్లో ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. ఎంతటి ప్రభావవంతమైన వ్యక్తులైనా కల్తీకి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని, బాధ్యులపై విచారణ జరిపి తగిన శిక్ష పడేలా చూస్తామని సిఎం హెచ్చరించారు.

మోరీ గేట్ కోవా మార్కెట్ ఆపరేషన్ సందర్భంగా ఆహార భద్రతా విభాగం నిపుణులు సేకరించిన 44 శాంపిళ్లలో మొబైల్ టెస్టింగ్ వ్యాన్ ద్వారా 35 శాంపిళ్లు ప్రాథమికంగా కల్తీ అయినట్లు తేలింది. మిల్క్ పౌడర్, వంట నూనెలు, బైండింగ్ ఏజెంట్లు కలపడం ద్వారా తయారైన ఈ నకిలీ కోవా మానవ శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుందని అధికారులు వెల్లడించారు. ఆహార పదార్థాల సరఫరా వ్యవస్థలోకి ఈ కల్తీ కోవా చేరుకోకుండా ప్రభుత్వం అడ్డుకోగలిగిందని అధికారులు ప్రకటించారు.

పండుగల సీజన్ ముగిసే వరకు మరియు ఏడాది పొడవునా ఢిల్లీ వ్యాప్తంగా ఇటువంటి తనిఖీలు, దాడులు నిరంతరాయంగా కొనసాగుతాయని ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో ఆటలాడుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, మార్కెట్లలో కల్తీ లేని వాతావరణాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ మేరకు వ్యాపారులు కూడా ఆహార ప్రమాణాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆహార భద్రత శాఖ హెచ్చరికలు జారీ చేసింది.