బియ్యం నాణ్యత లో రాజీ పడొద్దు..
గోదాముల్లో నిలువల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఆరు బఫర్ గోదాంల హమాలీలకు లేబర్ కార్డులు ఇప్పిస్తాం.
అధికారులకు కలెక్టర్ తేజస్ నందాల పవర్ఆదేశం.
గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ.
కోదాడ (మేజర్ న్యూస్) గోదాంలలో బియ్యం నిల్వ, నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం కోదాడ సమీపంలోని బాలాజీనగర్ ఎస్‌డబ్ల్యూసీ గోదాం ల లో నిలవ ఉన్న బియ్యాన్నిజిల్లా కలెక్టర్, ఎస్పీ కె. నరసింహ సందర్శించి తనిఖీలు నిర్వహించారు. గోదాంలోని బియ్యం నిల్వలను, నిర్వహణ తీరును పరిశీలించారు. స్టాక్ రికార్డులను తనిఖీ చేయడంతో పాటు బియ్యం శాంపిల్స్ సేకరించి నాణ్యత పరీక్షలు చేయించారు. పరీక్ష ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదలకు పంపిణీ చేసే సన్న బియ్యాన్ని జాగ్రత్తగా నిల్వ చేయాలని సూచించారు. బియ్యం నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని గోదాం మేనేజర్, టెక్నికల్ అసిస్టెంట్లకు స్పష్టం చేశారు. నిల్వ చేసే విధానం, భద్రతా ప్రమాణాలు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. రికార్డులను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
హమాలీలకు లేబర్ కార్డులు.___________________________
అనంతరం గోదాంలో పనిచేస్తున్న హమాలీలతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తమకు లేబర్ కార్డులు ఇప్పించాలని వారు కోరగా కలెక్టర్ వెంటనే స్పందించారు. సంబంధిత లేబర్ అధికారితో మాట్లాడి జిల్లాలోని ఆరు బఫర్ గోదాంలలో పనిచేస్తున్న హమాలీలందరికీ లేబర్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హమాలీల ఇతర సమస్యలను కూడా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో హమాలీలు కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సూర్యనారాయణ, జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, తాసిల్దార్ సంతోష్ కిరణ్ ఎస్‌డబ్ల్యూసీ మేనేజర్ సందీప్, టెక్నికల్ అసిస్టెంట్లు భాస్కర్ రెడ్డి, అరుణ తదితరులు పాల్గొన్నారు.