BREAKING
భూసార పరిరక్షణతోనే భవిష్యత్తు వ్యవసాయానికి భరోసా ఆర్టీసీ యాజమాన్య వైఖరి మార్చుకోకుంటే పోరాటం తప్పదు .... డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలి యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన సామినేని వెంకటకృష్ణ ప్రసాద్ రైతు గర్జన సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. గణపురం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి-మాజీ పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌లో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం లారీ ఢీకొని ద్వి చక్ర వాహనదారుడు దుర్మరణం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలకు రంగం సిద్ధం చిరు వ్యాపారులకు వెంటనే ప్రత్యామ్నాయ షెల్టర్లు ఏర్పాటు చేయాలి- ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.. 18 వ వార్డు లో బిజెపి అభ్యర్థి అరుణ యాదవ్ ఘనవిజయం. కళకే కళంకితులు.. జనసేనలోకి వలసల వెల్లువ.

జనసేనలోకి వలసల వెల్లువ.

Select Suryaa Now
జనసేనలోకి వలసల వెల్లువ.

జనసేనలోకి వలసల వెల్లువ.

బలుసుపాడు గ్రామాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు జనసేన పార్టీలో చేరిక.

జగ్గయ్యపేట రూరల్ మేజర్ న్యూస్ :-జగ్గయ్యపేట మండలం, అన్నవరం గ్రామంలో నిర్వహించిన కూటమి సమావేశంలో రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. బలుసుపాడు గ్రామాలకు చెందిన పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సామినేని ఉదయభాను  ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సామినేని ఉదయభాను వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరిన వారిలో శీలం  వీరభద్రరావు, ఉప్పుతోల నరసింహారావు,  మార్తి రాంబాబు, మార్తి రమేష్, గుండ్ర శీను, ఆతుకురి గోపాలరావు, కొరివి బాబురావు, ఉప్పుతోల్ల శీను. గుండ్రా లక్ష్మమ్మ  చేరారు.

అనంతరం ఉదయభాను మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నవంబర్ 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వెలమాటి చిట్టిబాబు , ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

 

 

రిపోర్టర్ :-శివారెడ్డి జగ్గయ్యపేట రూరల్ ఎన్టీఆర్ జిల్లా