BREAKING
ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు నిరంతరం ప్రత్యేక శ్రద్ధ వహించాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నేను నిందితురాల్ని కాదు.. కేవలం సాక్షిగా మాత్రమే విచారణకు పిలిచారు: స్పష్టం చేసిన నోరా ఫతేహి లీగల్ టీమ్! పవర్‌గూడలో ఉచిత ట్యూషన్ కార్యక్రమం ప్రారంభం పలమనేరు మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ హవా.. 12 స్థానాల్లో ఘన విజయం! రామాయణ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ.. వంద కోట్ల మార్క్‌ను దాటేసిన రణ్ కపూర్, యశ్ ప్రతిష్టాత్మక చిత్రం! రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ హనీ సింగ్ మేనల్లుడు మృతి.. కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు! 7వ డివిజన్ కార్పొరేటర్ గా కృష్ణ యాదవ్ ఘనవిజయం. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఏఐ, డీప్‌ఫేక్స్ ముప్పుపై కీలక చర్చ! బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌కు సూరత్ కోర్టు బెయిలబుల్ వారెంట్! ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు జరిగిన 27 వార్డులలో కౌంటింగ్ పూర్తి... పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి -- నవంబర్ 6న చివరి గడువు -- యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్ ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గా డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఘన విజయం.. •మహాప్రస్థానాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు •అభివృద్ధి,నిర్వహణపై అధికారులతో సమీక్ష మైనింగ్ నిర్లక్ష్యానికి ఇద్దరు గొర్రెల కాపర్లు బలి.. గుంతలో పడి ఇద్దరి దుర్మరణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తువుల పంపిణి.

యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

Select Suryaa Now
యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలి

సూర్య, మాక్లూర్ :మాక్లూర్ మండలంలోని గుంజీలి, ధర్మోర గ్రామాల్లో యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటల సాగుపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణ అధికారి నరేష్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉందని, అదేవిధంగా విద్యుత్ కొరత కూడా ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.ఈ నేపథ్యంలో రైతులు యాసంగి సీజన్‌లో వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలైన పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపిక చేసుకోవాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గుంజీలి సర్పంచ్ గోపు గోపి, ఉపసర్పంచ్ జింక సుమన్, ధర్మోర సర్పంచ్ పందిరి శ్రీనివాస్, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.