పలమనేరు మున్సిపల్ ఎన్నికలలో టీడీపీ హవా.. 12 స్థానాల్లో ఘన విజయం!
పలమనేరు మున్సిపాలిటీ ఎన్నికల తుది ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ (TDP) జైత్రయాత్ర సాగించింది. 16వ వార్డు నుండి 30వ వార్డు వరకు జరిగిన కౌంటింగ్‌లో టీడీపీ ఏకపక్ష ఆధిక్యతను ప్రదర్శించింది. మొత్తం 15 వార్డులలో ఏకంగా 12 వార్డులను తన ఖాతాలో వేసుకుని ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కేవలం 3 వార్డులకే పరిమితం కాగా, బీజేపీ, జనసేన పార్టీలు ఖాతా తెరవలేకపోయాయి. పలమనేరు మున్సిపల్ కమిషనర్ ఫలితాలను అధికారికంగా వెల్లడించారు.
వార్డుల వారీగా విజేతలు – మెజారిటీల వివరాలు:
టీడీపీ ఘనవిజయం: 16వ వార్డులలో ఆర్. అన్నపూర్ణ (215 ఓట్ల మెజారిటీ), 18వ వార్డులో ఎం. ఆర్. చంద్రకళ (338 ఓట్ల మెజారిటీ), 20వ వార్డులో షేక్ నూరి (112 మెజారిటీ), 21వ వార్డులో ఎం. మని (24 మెజారిటీ), 22వ వార్డులో డి. చంద్రారెడ్డి (37 మెజారిటీ), 23వ వార్డులో డి. సుబ్రమణ్యం (74 మెజారిటీ), 24వ వార్డులో ఎస్. విజయకుమారి (233 మెజారిటీ), 25వ వార్డులో టి. జయలక్ష్మి (237 మెజారిటీ), 26వ వార్డులో జె. శ్రీనివాసులు (242 మెజారిటీ), 27వ వార్డులో వి. గిరిబాబు (183 మెజారిటీ), 28వ వార్డులో ఆర్. లోకనాథ్ ఆచారి (108 మెజారిటీ), 29వ వార్డులో ఆర్. పవిత్ర (143 ఓట్ల మెజారిటీ)తో విజయఢంకా మోగించారు.
వైసీపీకి మూడు స్థానాలు: 17వ వార్డులో బి. అక్షయ్ (135 మెజారిటీ), 19వ వార్డులో ఎం. మూర్తి (38 మెజారిటీ), 30వ వార్డులో ఎస్. డి. మురళీకృష్ణ కేవలం 17 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు.
పార్టీల వారీగా పోలైన మొత్తం ఓట్లు:
ఈ 15 వార్డుల పరిధిలో మొత్తం 13,347 ఓట్లు పోల్ అవ్వగా.. పార్టీల వారీగా ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
తెలుగుదేశం పార్టీ (TDP): 6,977 ఓట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP): 5,599 ఓట్లు,భారతీయ జనతా పార్టీ (BJP): 378 ఓట్లు,జనసేన పార్టీ (JSP): 0 ఓట్లు,ఎస్.డి.పి.ఐ (SDPI): 52 ఓట్లు
ఇండిపెండెంట్: 4 ఓట్లు,నోటా (NOTA): 72 ఓట్లు, చెల్లని ఓట్లు (Invalid): 265 ఓట్లు.