andhrapradesh
అనంతపురం కార్పొరేషన్‌లో వైసీపీ ఆధిక్యం
అనంతపురం:అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) పుంజుకుంది. ఇప్పటివరకు వెలువడిన ట్రెండ్స్ మరియు లెక్కింపు వివరాల ప్రకారం నగరంలోని 14 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఇతర డివిజన్లలో కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ శరవేగంగా సాగుతుండటంతో రౌండ్ల వారీగా పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.