కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.. 28 వార్డులు కైవసం.
కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది. మొత్తం 32 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించి తమ రాజకీయ పట్టును చాటుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు కొన్ని వార్డుల్లో గెలుపొందగా, జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా విజయాలు నమోదు చేశారు. ముఖ్యంగా పలు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీలతో విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మి తిమ్మరాజుకు అనుకూలంగా ఫలితాలు వెలువడటంతో టీడీపీ శిబిరంలో సంబరాలు నెలకొన్నాయి. మొదటి వార్డులో టీడీపీ అభ్యర్థి నల్లబోతుల కృష్ణమోహన్ 561 ఓట్లు సాధించి వైసీపీ అభ్యర్థిపై 160 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండో వార్డులో హెచ్. హనుమంతు 551 ఓట్లతో 155 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. మూడో వార్డులో వైసీపీ అభ్యర్థి అన్నపూర్ణ 501 ఓట్లతో 80 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, నాలుగో వార్డులో వైసీపీ అభ్యర్థి 86 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఐదో వార్డులో ఉంటంకి వెంకటలక్ష్మి 815 ఓట్లతో 566 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. ఆరో వార్డులో బంట్రోతు శైలజ 413 ఓట్ల మెజారిటీతో, ఏడో వార్డులో పెంటల వాణి 358 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎనిమిదో వార్డులో కొండోజి సునీత 673 ఓట్లు సాధించి విజయం సాధించగా, తొమ్మిదో వార్డులో జనసేన అభ్యర్థి వనం అమృత 475 ఓట్లతో 238 ఓట్ల మెజారిటీ సాధించారు. పదో వార్డులో ఎన్. వెంకటరమణ 199 ఓట్ల ఆధిక్యంతో, 11వ వార్డులో తిమ్మరాజమ్మ 441 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి రేవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 13వ వార్డులో గోళ్ల హసీనా బేగం 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, 14వ వార్డులో వైసీపీ అభ్యర్థి రామాంజనేయులు 55 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 15వ వార్డులో పూజారి నాగమణి 162 ఓట్లతో, 16వ వార్డులో సూగేపల్లి త్రివేణి 232 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 17వ వార్డులో వైసీపీ అభ్యర్థి సల్ల నవిత 62 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించగా, 18వ వార్డులో బీజేపీ అభ్యర్థి అరుణ యాదవ్ 201 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 19వ వార్డులో గుండ్ల పావని 33 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో, 20వ వార్డులో అచ్చువల్లి అనిత 574 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 21వ వార్డులో పూజారి ఆశ 178 ఓట్లతో, 22వ వార్డులో వీటీ శ్వేత 533 ఓట్లతో, 23వ వార్డులో బాల సోము 687 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 24వ వార్డులో ఎస్. పార్వతమ్మ 564 ఓట్ల ఆధిక్యంతో, 25వ వార్డులో పూజారి మహేష్ 713 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 26వ వార్డులో ఇమ్రాన్ భాష 646 ఓట్లతో, 27వ వార్డులో పూల వెంకటేశులు 505 ఓట్లతో, 28వ వార్డులో గెల్లి వెంకట కార్తీక్ 607 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 29వ వార్డులో జె. అన్వర్ భాష 535 ఓట్లతో, 30వ వార్డులో ఎం. ఈశ్వరమ్మ 139 ఓట్లతో, 31వ వార్డులో ఇటుకుల రామాంజనేయులు 644 ఓట్లతో, 32వ వార్డులో బేరీల గోవిందప్ప 320 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మొత్తంగా ఎన్నికల ఫలితాలు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని అందించాయి. పలువురు అభ్యర్థులు భారీ మెజారిటీలతో గెలుపొందడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించిన తుది అధికారిక ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి