sports
స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం
మాడ్రిడ్:స్పెయిన్ సెకండ్ డివిజన్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైదానంలో బంతిని ఛేజ్ చేసే క్రమంలో ప్రత్యర్థి జట్టు గోల్‌కీపర్ మోకాలు బలంగా ఛాతీకి తగలడంతో తీవ్రంగా గాయపడిన 'సీడీ టెనెరిఫ్' ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ (30) మంగళవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సీడీ టెనెరిఫ్, ఎఫ్‌సీ ఆండోరా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 2-2తో సమంగా ఉన్న సమయంలో ఆండోరా గోల్‌కీపర్ జీసస్ ఒవోనో బంతిని అడ్డుకోవడానికి ముందుకు వచ్చారు.
వెంటనే స్పందించిన వైద్య సిబ్బంది ఐదు నిమిషాల పాటు మైదానంలోనే సీపీఆర్ అందించి గుండె స్పందనలను పునరుద్ధరించిన అనంతరం అత్యవసరంగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. 2015లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిన మిగెల్ మృతి పట్ల ఫుట్‌బాల్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది.