BREAKING
రెవెన్యూ సేవలలో అలసత్వాన్ని సహించేది లేదని పారదర్శక రెవిన్యూ పాలన లక్ష్యం శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు పాత రేగ దుప్పలపూడి గ్రామాల్లో విస్తృత పర్యటన రాజమహేంద్రవరం లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పర్యటన ప్రకృతి వ్యవసాయంతో భూసార పరిరక్షణ అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం జన జాతరగా రేవతి ఎన్నికల ప్రచారం ఆ పదం నాకు అస్సలు నచ్చదు.. బాలీవుడ్ కాకుండా ఇండియన్ సినిమా ప్రతినిధిగా గుర్తింపు కోరుకుంటున్న రణ్‌బీర్! నీటి సంరక్షణ పై అవగాహన భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచార పర్వం కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు బలమైన భారత్ ఏ జట్టు ప్రకటన! నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారావద్దు - నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.. ఆ అధ్యాయం ముగిసింది.. షమీ పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఊరెళ్ల గ్రామకంఠం భూములకు సర్వే చేయాలని వినతి

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి.

Select Suryaa Now
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి.

 

దర్శి లో మురుసు తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రం పరిశీలన.

బాధితులకు భోజనం, ఫ్రూట్స్ పంపిణీ చేసిన దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

సూర్య న్యూస్ దర్శి.
దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్ లోని ఎన్ఎస్పి కాలనీ నందు  సాయి నగర్ లో ఏర్పాటు చేసిన మురుసు తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాన్ని దర్శి టీడీపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ సందర్శించారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వర్షంలోనే పర్యటిస్తూ బాధితులకు అండగా నిలిచారు.  బాధితులకు స్వయంగా భోజనం వడ్డించి, ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, ఈ పునరావాస కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం అధికారులను అప్రమత్తం చేస్తూ.. లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు నిలవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, లైన్లు మరియు ట్రాన్స్‌ఫార్మర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా రెస్క్యూ బృందాలు, కంట్రోల్ రూమ్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ ప్రస్తుత  చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి నూతన మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు, మున్సిపల్ కమిషనర్ కె అర్జున్ రావు, అధికారులు పాల్గొన్నారు.