BREAKING
ఆ పదం నాకు అస్సలు నచ్చదు.. బాలీవుడ్ కాకుండా ఇండియన్ సినిమా ప్రతినిధిగా గుర్తింపు కోరుకుంటున్న రణ్‌బీర్! నీటి సంరక్షణ పై అవగాహన భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచార పర్వం కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు బలమైన భారత్ ఏ జట్టు ప్రకటన! నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారావద్దు - నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.. ఆ అధ్యాయం ముగిసింది.. షమీ పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఊరెళ్ల గ్రామకంఠం భూములకు సర్వే చేయాలని వినతి నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గిరిజన గురుకులంలో చిత్రలేఖన శిక్షణ... ఆళ్లగడ్డ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం పట్టపగలే వెలిగే ఐమాక్స్ లైట్లు - వృథా అవుతున్న విద్యుత్.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.. 28 వార్డులు కైవసం.

కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

Select Suryaa Now
కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

కుందుర్పి: మండలంలోని తెనగల్లు, కరిగానపల్లి గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను కలిశారు. వీధివీధినా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ విధానాలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమంలో పసుపు జెండాలు, సైకిల్ గుర్తులతో టీడీపీ శ్రేణులు సందడి చేశాయి. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆశీస్సులతో, కుందుర్పి మండల టీడీపీ అధ్యక్షుడు జి. ధనుంజయ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం కొనసాగింది. కుందుర్పి మండల జడ్పీటీసీ అభ్యర్థి జి.ఎల్. ప్రభావతి, ఎంపీటీసీ అభ్యర్థి సుమియా భానును గెలిపించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు సమన్వయంతో ముందుకు సాగారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆదరణ, కార్యకర్తల కృషితో ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే తమ ప్రాధాన్యమని పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. ఎన్నికల ప్రచారంతో తెనగల్లు, కరిగానపల్లి గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయ రంగస్వామి.