తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు!
నెల్లూరు, మేజర్ న్యూస్ : ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాం తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలోనూ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు.