నెల్లూరు సిటీలో టీడీపీ తొలి విజయం!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు కార్పొరేషన్‌లో బోణీ కొట్టిన తెలుగుదేశం పార్టీ
నెల్లూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసింది. నగరంలోని 59వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి హరికృష్ణ విజయం సాధించారు. ఈ గెలుపుతో నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీ తన విజయ ఖాతాను తెరిచింది. హరికృష్ణ విజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.