హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్
మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిఅన్నారం పోచమ్మ బస్తీలో మహిళపై కత్తితో దాడి చేసి సెల్‌ఫోన్ దోచుకెళ్లిన కేసులో ముగ్గురు నిందితులను మలక్‌పేట్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బాధితురాలి వన్‌ప్లస్ ఫోన్‌తో పాటు మొత్తం 22 సెల్‌ఫోన్లు, మూడు ద్విచక్ర వాహనాలు, నేరానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులైన ఏ-1, ఏ-2లపై గతంలో వరుసగా 59, 39 క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించారు.