BREAKING
జన జాతరగా రేవతి ఎన్నికల ప్రచారం ఆ పదం నాకు అస్సలు నచ్చదు.. బాలీవుడ్ కాకుండా ఇండియన్ సినిమా ప్రతినిధిగా గుర్తింపు కోరుకుంటున్న రణ్‌బీర్! నీటి సంరక్షణ పై అవగాహన భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచార పర్వం కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు బలమైన భారత్ ఏ జట్టు ప్రకటన! నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారావద్దు - నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.. ఆ అధ్యాయం ముగిసింది.. షమీ పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఊరెళ్ల గ్రామకంఠం భూములకు సర్వే చేయాలని వినతి నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గిరిజన గురుకులంలో చిత్రలేఖన శిక్షణ... ఆళ్లగడ్డ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం పట్టపగలే వెలిగే ఐమాక్స్ లైట్లు - వృథా అవుతున్న విద్యుత్..

రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి? కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు? రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక

Select Suryaa Now
రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి?  కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు?  రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక

రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి?

కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు?

రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక

జూర్‌నగర్, నేరేడుచర్ల మేజర్ న్యూస్

హుజూర్‌నగర్‌లో ఇటీవల జరిగిన పట్టభద్రుల సమావేశంలో చోటుచేసుకున్న కుర్చీ వ్యవహారం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి సమక్షంలో జరిగిన సమావేశంలోనే రఘుకు కుర్చీ ఏర్పాటు చేయకపోవడం, మరోవైపు మాజీ జడ్పీటీసీ రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ వ్యవహారంపై రఘు పీఏగా పరిచయమైన శివారెడ్డిని ఫోన్ ద్వారా వివరణ కోరగా ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం మరిన్ని ప్రశ్నలకు తావిస్తోంది.మాజీ మంత్రి సూచించిన తర్వాత కూడా కుర్చీ వ్యవహారంలో మార్పు ఎందుకు రాలేదు? రఘుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి కారణమేమిటి? మాజీ జడ్పీటీసీ వ్యవహరించిన తీరు వెనుక రాజకీయ ఉద్దేశాలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి.మరోవైపు, శివారెడ్డి రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా కనిపిస్తుండటంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపైనా చర్చ మొదలైంది. రాబోయే రోజుల్లో జడ్పీటీసీ పదవిని లక్ష్యంగా చేసుకుంటున్నారా? లేక తెరవెనుక మరేదైనా రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారా? అన్న ఆసక్తి నెలకొంది.

ఇంతకీ శివారెడ్డి ఎవరి పీఏ?

రఘు తరఫున బాధ్యతలు నిర్వహిస్తున్నారా? లేక ఇతర రాజకీయ నాయకులతోనూ రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నారా? పీఏ హోదాలో ఉంటూ రాజకీయంగా ఇంతటి ప్రాధాన్యత పొందడం వెనుక కారణమేమిటి?కుర్చీ వ్యవహారంపై శివారెడ్డి ఎందుకు స్పందించడం లేదు? మాజీ జడ్పీటీసీ తన వైఖరిని వెల్లడిస్తారా? రఘుకు జరిగిన పరిణామంపై సంబంధిత నాయకులు వివరణ ఇస్తారా?ప్రస్తుతం సమాధానం లేని ఈ ప్రశ్నలకు రాబోయే రోజుల్లో ఎవరు తెరదించుతారో వేచి చూడాలి.