telangana
తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి
Telangana
03 Nov 2026
31 views
సూర్య తిర్యాణి : తిర్యాణి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆసిఫాబాద్ మార్కెట్ డైరెక్టర్, జవహర్ బాల్ మంచ్ జిల్లా చైర్మన్ నైతం రాంచందర్, కాంగ్రెస్ పార్టీ తిర్యాణి మండల అధ్యక్షుడు కొట్నాక గణపతి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన అండర్–17 బాలుర వాలీబాల్ జోనల్ స్థాయి ఎంపిక పోటీలకు వారు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను ప్రోత్సహించారు.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉత్సాహంగా పోటీపడ్డారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. జట్టు సమన్వయంతో ఆడుతూ, నిరంతర సాధనతో నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి మాడవి షేకు, జోనల్ నోడల్ అధికారి మీనా రెడ్డి, తిర్యాణి ప్రభుత్వ పాఠశాల పీజీహెచ్‌ఎం మెస్రం చంద్రకాంత్, గిన్నెదరి పీజీహెచ్‌ఎం నైతం కృష్ణారావు, రొంపల్లి హెచ్‌ఎం మడవి గోపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు రామ్ మోహన్, ఆర్‌ఎస్‌జీఎఫ్ మాజీ కార్యదర్శి జి. శ్రీనివాస్, టీజీ పీఈటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్. బ్రహ్మం పాల్గొన్నారు.అలాగే కేబీఏఎస్‌ఎఫ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండం లక్ష్మన్, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కుర్సెంగా శ్రీనివాస్, పెందోర్ సుభాష్, కార్తీక్, రవీందర్, రాయిసిడం మహాదు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల నాయకుడు జూగ్నక మారుతీ, మండల పార్టీ అధికార ప్రతినిధి కూన సురేష్, ఎస్సీ సెల్ నాయకుడు ముంజం సతీష్, మండల కార్యదర్శి పూసం రాజు, టెకం కొండూ, రాయిసిడం ముత్తు, క్రీడా నిర్వాహకులు, ఉపాధ్యాయులు, వివిధ జిల్లాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
Latest News