BREAKING
భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన ముగిసిన స్థానిక ఎన్నికల ప్రచార పర్వం కెప్టెన్‌గా తిలక్ వర్మ.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు బలమైన భారత్ ఏ జట్టు ప్రకటన! నేరాలకు పాల్పడి నేరస్తులుగా మారావద్దు - నాగర్ కర్నూల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ నిహారిక ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రికి మౌలిక వసతులు కల్పిస్తాం: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.. ఆ అధ్యాయం ముగిసింది.. షమీ పునరాగమనంపై భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఊరెళ్ల గ్రామకంఠం భూములకు సర్వే చేయాలని వినతి నకిలీ కస్టమర్ కేర్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి గిరిజన గురుకులంలో చిత్రలేఖన శిక్షణ... ఆళ్లగడ్డ మండల నాయకులతో సమావేశమైన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం పట్టపగలే వెలిగే ఐమాక్స్ లైట్లు - వృథా అవుతున్న విద్యుత్.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.. 28 వార్డులు కైవసం. ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌పై హైకోర్టులో సవాల్ డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

సొంత డివిజన్‌లోనే ఆనం విజయకుమార్ రెడ్డికి ఎదురుదెబ్బ!

Select Suryaa Now
సొంత డివిజన్‌లోనే ఆనం విజయకుమార్ రెడ్డికి ఎదురుదెబ్బ!

నెల్లూరు,  మేజర్ న్యూస్ :    చింతారెడ్డిపాలెం 5వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఇంగిలాల అబ్రహం విజయం.  398 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గెలుపు..

నెల్లూరు రూరల్ రాజకీయాల్లో చింతారెడ్డిపాలెం 5వ డివిజన్ ఎన్నికల ఫలితం ఆసక్తికరంగా మారింది. ఆనం విజయకుమార్ రెడ్డి సొంత ప్రాంతమైన చింతారెడ్డిపాలెంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి జాషువా ఓటమి పాలయ్యారు. ఈ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి ఇంగిలాల అబ్రహం 398 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికను కోటంరెడ్డి సోదరులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు ఆనం విజయకుమార్ రెడ్డికి సొంత ప్రాంతంలోనే ఎదురైన ఈ ఫలితం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చింతారెడ్డిపాలెం ఫలితంతో నెల్లూరు రూరల్ రాజకీయాల్లో కోటంరెడ్డి సోదరుల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది.