BREAKING
మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్ న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే! రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి? కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు? రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు. డ్రాగా ముగిసిన రెండో అనధికారిక టెస్ట్.. అద్భుత శతకాలతో అదరగొట్టిన జైస్వాల్, యశ్! నెల్లూరు సిటీలో టీడీపీ తొలి విజయం! కిడ్నీ బాధితురాలికి వసుధ ఫౌండేషన్ రూ.10 వేల సాయం. శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ భారీ ఆధిక్యం వైపు! తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు! అనంతపురం కార్పొరేషన్‌లో వైసీపీ ఆధిక్యం నెల్లూరు 51వ డివిజన్‌లో టీడీపీ ఘన విజయం! ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో శకం ముగింపు.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గ్లెన్ మాక్స్‌వెల్! సొంత డివిజన్‌లోనే ఆనం విజయకుమార్ రెడ్డికి ఎదురుదెబ్బ! 17 వ వార్డులో వై కా పా అభ్యర్థి దీప్తి ఘనవిజయం.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి.. మూడు రోజులే గడువు : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదును వేగవంతం చేయాలి.. మూడు రోజులే గడువు : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మర్పల్లి, మేజర్ న్యూస్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు ముగియడానికి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. మర్పల్లి మండలం పట్లూర్ గ్రామంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు సమీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గడువు తక్కువగా ఉన్నందున మిగిలిన మూడు రోజులను సద్వినియోగం చేసుకుని ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు. అనంతరం తుమ్మలపల్లి గ్రామంలో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, పార్టీ కార్యక్రమాల విస్తరణతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు పరిస్థితిపై చర్చించారు. ప్రతి గ్రామంలో అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, గ్రామాల వారీగా ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించి నమోదు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు. గడువులోగా అర్హులైన పట్టభద్రులందరికీ ఓటు హక్కు కల్పించే దిశగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని ఆయన కోరారు.