BREAKING
స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం పట్టపగలే వెలిగే ఐమాక్స్ లైట్లు - వృథా అవుతున్న విద్యుత్.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.. 28 వార్డులు కైవసం. ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌పై హైకోర్టులో సవాల్ డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం

పవర్‌గూడలో ఉచిత ట్యూషన్ కార్యక్రమం ప్రారంభం

Select Suryaa Now
పవర్‌గూడలో ఉచిత ట్యూషన్ కార్యక్రమం ప్రారంభం
సూర్య జైనూర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పవర్‌గూడ గ్రామంలో యూత్ ఫర్ సేవ, ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఉచిత ట్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఉచిత ట్యూషన్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్‌తో పాటు గ్రామస్తులు, పటేల్‌లు, దేవరీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉచిత ట్యూషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన యూత్ ఫర్ సేవ, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులను గ్రామస్తులు అభినందించారు.