BREAKING
డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్ న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే! రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి? కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు? రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

Select Suryaa Now
పట్టభద్రులంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలి

నారాయణపేట, సూర్యన్యూస్ :  త్వరలో జరగనున్న మహబూబ్‌నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుకు నవంబర్ 6వ తేదీ చివరి గడువు అని యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రవికుమార్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పట్టభద్రులందరూ గడువులోగా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ.. డిగ్రీ లేదా ఆపై విద్యార్హత కలిగిన పట్టభద్రులు సంబంధిత విద్యార్హత పత్రాలతో ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ బరిలో ఉన్నారని తెలిపారు. పట్టభద్రుల సమస్యలను అర్థం చేసుకొని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత విద్యావంతులపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి ఉద్యోగ నియామక ప్రకటనలు విడుదల చేస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విద్యావంతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధం లాంటిదని రవికుమార్ గౌడ్ అన్నారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా ఓటర్లుగా నమోదు చేసుకొని, ఎన్నికల సమయంలో తప్పనిసరిగా తమ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. నవంబర్ 6వ తేదీతో ఓటరు నమోదు గడువు ముగియనున్నందున అర్హులైన ప్రతి పట్టభద్రుడు వెంటనే స్పందించి నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.