BREAKING
స్పానిష్ ఫుట్‌బాలర్ జీసస్ డి మిగెల్ విషాదాంతం పట్టపగలే వెలిగే ఐమాక్స్ లైట్లు - వృథా అవుతున్న విద్యుత్.. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.. 28 వార్డులు కైవసం. ఆస్ట్రేలియా సోషల్ మీడియా బ్యాన్‌పై హైకోర్టులో సవాల్ డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం

ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Select Suryaa Now
ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
సూర్య, నిర్మల్ జిల్లా ప్రతినిధి:జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ముధోల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాల ఆవరణను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవంతిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దాని స్థానంలో నూతన అదనపు తరగతుల నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
అనంతరం ఐదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలన్నారు. వారి స్నేహితులెవరైనా బడికి రానట్లయితే, వారిని కూడా తీసుకొని రావాలన్నారు. వారితో లెక్కలు సులభంగా అర్థమయ్యేలా మెలకువలను నేర్పి, కొన్ని లెక్కలు చేయించారు. ఇంగ్లీష్ పదాలను వ్యతిరేక క్రమంలో చదివిపించారు. విద్యార్థుల ప్రతిభను కలెక్టర్ మెచ్చుకున్నారు. పలువురు విద్యార్థులకు పెన్నులను బహుమతులుగా ఇచ్చారు. వారిని అభినందించారు.ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల ప్రతిభపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు.ఈ తనిఖీలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ శ్రీలత, ఎంపిడివో లవకుమార్, డిఎల్పిఓ లక్ష్మణ్, సర్పంచ్ షబానా బేగం, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.