BREAKING
డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్ న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే! రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి? కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు? రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

మైనింగ్ నిర్లక్ష్యానికి ఇద్దరు గొర్రెల కాపర్లు బలి.. గుంతలో పడి ఇద్దరి దుర్మరణం

Select Suryaa Now
మైనింగ్ నిర్లక్ష్యానికి ఇద్దరు గొర్రెల కాపర్లు బలి.. గుంతలో పడి ఇద్దరి దుర్మరణం

ధారూర్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం తరిగోపుల గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మైనింగ్ గుంతలో పడి ఇద్దరు గొర్రెల కాపర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తరిగోపుల గ్రామానికి చెందిన సకిల్లా శ్రీనివాస్ (43), మున్నూరు అశోక్ (21) గొర్రెలను మేపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు మైనింగ్ తవ్వకాలతో ఏర్పడిన గుంతలో పడిపోవడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మైనింగ్ నిర్వహణలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రమాదకరమైన గుంతల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడమే ప్రమాదానికి కారణమని గ్రామస్థులు, మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మైనింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ యజమానులతో పాటు సంబంధిత అధికారులు కూడా భద్రతా చర్యల పర్యవేక్షణలో బాధ్యత వహించాలని కోరుతున్నారు. ఒకే ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో తరిగోపుల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్థులను కలచివేశాయి.