BREAKING
డిప్లొమా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు న్యూజిలాండ్‌కు గట్టి షాక్.. భారత్‌తో తొలి వన్డేకు దూరమైన స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే! హెచ్‌ఎంపై మండల విద్యాశాఖ అధికారికి తల్లిదండ్రుల ఫిర్యాదు - మద్యం సేవించి విధులకు వస్తున్నారంటూ విద్యార్థుల ఆరోపణలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బాధితులకు అండగా నిలిచిన గొట్టిపాటి లక్ష్మి. తిర్యాణిలో వాలీబాల్ ఎంపిక పోటీల సందడి నా ఫోన్ కాల్స్ ఎత్తలేదు.. జట్టు నుంచి తప్పించడానికి కారణం చెప్పాలంటూ రాజేశ్వరి గైక్వాడ్ డిమాండ్! సెలెక్టర్ల తీరుపై సర్‌ఫరాజ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి.. కష్టపడినా గుర్తింపు లేదా అంటూ ఆవేదన! జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో కుదుపు: ఎన్సీకి మెహదీ రాజీనామా సై నిధులు ఇవ్వలేదు.. సొంత డబ్బులతోనే యూరప్ టోర్నీల్లో పాల్గొన్నాం: పీవీ సింధు సంచలన వ్యాఖ్యలు! మలక్‌పేటలో సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు మచిలీపట్నం కార్పొరేషన్ టీడీపీ కైవసం హత్యాయత్నం, దోపిడీ కేసులో ముగ్గురు అరెస్ట్ న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే! రఘు పీఏ మౌనం వెనుక మర్మమేమిటి? కుర్చీ వ్యవహారంపై సమాధానం చెప్పేదెవరు? రఘును పక్కకు జరిపి రాకేష్ రెడ్డి పక్కన కూర్చున్న మాజీ జడ్పీటీసీ.. హుజూర్‌నగర్‌లో హాట్ టాపిక కుందుర్పి తెలుగు దేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి ప్రచారం జోరు.

కరువుతో పంటలు ఎండిపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Select Suryaa Now
కరువుతో పంటలు ఎండిపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి

కోహెడ మేజర్ న్యూస్:కరువు పరిస్థితులు, సాగునీటి కొరత కారణంగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పంట నష్టపరిహారం అందించాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సీపీఐ నాయకులతో కలిసి కోహెడ మండలంలోని పర్వేద, కూరేళ్ల గ్రామాల్లో ఆయన పర్యటించి ఎండిపోయిన వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట పొలాలను సందర్శించి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి పరిస్థితులను, సాగు కోసం పెట్టిన పెట్టుబడులు, ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ.. రైతులు ఎన్నో ఆశలతో అప్పులు చేసి, కుటుంబ అవసరాలను పక్కనపెట్టి, వ్యవసాయంపై నమ్మకంతో పంటలు సాగు చేస్తున్నారని అన్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత కారణంగా వరి పంటలు ఎండిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ఎకరాల కొద్దీ సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతమని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు, విత్తనాలు,ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులతో పాటు సాగునీటి కోసం చేసిన వ్యయం కూడా రైతులకు భారంగా మారిందని తెలిపారు. పంట దిగుబడి రాకపోవడంతో రైతులు పెట్టిన పెట్టుబడులు తిరిగి వచ్చే పరిస్థితి లేదని, మరోవైపు అప్పుల భారం పెరిగి భవిష్యత్తులో వ్యవసాయం కొనసాగించడమే కష్టంగా మారుతోందని అన్నారు.ఈ పరిస్థితుల్లో పంట నష్టపోయిన రైతులకు కేవలం ఓదార్పు సరిపోదని, వారి నష్టాన్ని కొంతమేర భర్తీ చేసేలా ఆర్థిక సహాయం అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పర్వేద, కూరేళ్లతో పాటు నష్టపోయిన అన్ని గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయాలని కోరారు. పంట పూర్తిగా ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా పంట నష్టపోయిన రైతులకు బ్యాంకు రుణాలు, వ్యవసాయ పెట్టుబడులు, తదుపరి పంట సాగు విషయంలో తగిన వెసులుబాటు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు తిరిగి వ్యవసాయం చేసుకునే ధైర్యాన్ని, భరోసాను కల్పించడం ప్రభుత్వ సహాయక చర్యల్లో ప్రధాన ప్రాధాన్యత కావాలని సూచించారు.రైతాంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, రైతు బాగుంటేనే వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, కరువు పరిస్థితుల వల్ల రైతులు నష్టపోయినప్పుడు వారిని ఆదుకోవడం సమాజం, ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.కావున పర్వేద, కూరేళ్ల గ్రామాలతో పాటు కోహెడ మండలంలో పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులందరికీ తక్షణ న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఎకరాకు రూ.50 వేల పంట నష్టపరిహారం అందించాలని మంద పవన్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేశ్,పిలి రజిని,సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ముంజ గోపి, సీపీఐ నాయకులు తాల్లపెళ్ళి ఎల్లయ్య,బండారు లక్ష్మణ్,చిట్యాల శేఖర్,  వేల్పుల ప్రసన్న కుమార్,కందుకూరి మహేష్, రాసూరి యుగేందర్, సుంకె కనుకయ్య, చంద్రయ్య, మల్లయ్య, చల్ల సత్తిరెడ్డి, చెప్యాల వెంకటి, జాగిరి బాలయ్య,పర్షరాములు,చంద్ర శేఖర్, ఆకుల నర్సయ్య,  గొల్ల కొమురయ్య, జాగిరి బాగయ్య, వేల్పుల మల్లయ్య, చెంచల రాజు, తదితరులు పాల్గొన్నారు.