BREAKING
డ్రాగా ముగిసిన రెండో అనధికారిక టెస్ట్.. అద్భుత శతకాలతో అదరగొట్టిన జైస్వాల్, యశ్! నెల్లూరు సిటీలో టీడీపీ తొలి విజయం! కిడ్నీ బాధితురాలికి వసుధ ఫౌండేషన్ రూ.10 వేల సాయం. శతక్కొట్టిన యశస్వి జైస్వాల్.. అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ భారీ ఆధిక్యం వైపు! తుఫాను ప్రభావం ఉన్నప్పటికీ కౌంటింగ్‌కు పటిష్ట ఏర్పాట్లు! అనంతపురం కార్పొరేషన్‌లో వైసీపీ ఆధిక్యం నెల్లూరు 51వ డివిజన్‌లో టీడీపీ ఘన విజయం! ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరో శకం ముగింపు.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గ్లెన్ మాక్స్‌వెల్! సొంత డివిజన్‌లోనే ఆనం విజయకుమార్ రెడ్డికి ఎదురుదెబ్బ! 17 వ వార్డులో వై కా పా అభ్యర్థి దీప్తి ఘనవిజయం. నెల్లూరు రూరల్ 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విజయం! నెల్లూరు సిటీ 14వ డివిజన్‌లో టీడీపీ ఘన విజయం! ‘అర్నబ్’ తుఫాన్ నష్టాన్ని సకాలంలో నివారించగలిగాం నెల్లూరు రాజకీయాల్లో జనసేన సంచలనం! చేనేతపురంలో "ధరణి "భోని

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలి

Select Suryaa Now
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో పూర్తి పారదర్శకత పాటించాలి

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్:మిర్యాలగూడ పట్టణంలో ఈ నెల 6వ తేదీన చేపట్టనున్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, లబ్ధిదారుల ఎంపికలో జరిగినట్లు వస్తున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిజమైన అర్హులైన పేదలకు న్యాయం చేయాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు డిమాండ్ చేశారు.

మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డి కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. పేదల కోసం నిర్మించిన ఇళ్లను నిజమైన అర్హులైన లబ్ధిదారులకే కేటాయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

ప్రస్తుతం ఇళ్ల పంపిణీకి సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, అర్హులైన పేదలను పక్కనపెట్టి అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.

లబ్ధిదారుల పూర్తి జాబితాను బహిరంగంగా ప్రకటించడంతో పాటు ఎంపికకు అనుసరించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సొంత ఇళ్లు ఉన్నవారు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనర్హులుగా ఉన్నవారు జాబితాలో ఉంటే వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ మేరకు మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించి, ఇళ్ల పంపిణీ ప్రక్రియలో పారదర్శకత పాటించాలని కోరారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా అర్హత ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేయాలని విజ్ఞప్తి చేశారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిరుపేదల హక్కు అని, వాటి కేటాయింపులో ఎలాంటి అన్యాయానికి తావులేకుండా అర్హులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని వారు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. ఇలియాస్ ఖాన్, ఎం.డి. మగ్దుం పాషా, బంటు శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, సందేషి అంజన్ రాజు, ఎం.డి. మాజీద్, తిరుమలగిరి వజ్రం, దైద సత్యం, గంగుల బిక్షం యాదవ్, జన్నపాల కిరణ్, దీపిక విజయ్, అరుణ్, ఎం.డి. అలీం, రుక్షాన, బంటు దుర్గయ్య, పందిరి వేణు, వల్లపట్ల వినోద్, ఖలీల్, ఎక్క మనిదీప్, బిక్కన్ తదితరులు పాల్గొన్నారు.