నెల్లూరు సిటీ 14వ డివిజన్‌లో టీడీపీ ఘన విజయం!
నెల్లూరు, మేజర్ న్యూస్ : 2,527 ఓట్ల భారీ మెజారిటీతో కువ్వారపు బాలాజీ గెలుపు నెల్లూరు నగరంలోని 14వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కువ్వారపు బాలాజీ ఘన విజయం సాధించారు. ప్రత్యర్థులపై 2,527 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు కువ్వారపు బాలాజీకి అభినందనలు తెలియజేశారు.