నెల్లూరు రాజకీయాల్లో జనసేన సంచలనం!
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు రాజకీయాల్లో 6వ డివిజన్ ఎన్నికల ఫలితం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. ఈ డివిజన్లో జనసేన అభ్యర్థి విజయం సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ గెలుపు కొందరు నాయకులకు మేలుకొలుపుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలో మంత్రి నారాయణ నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదన్న ప్రచారం నేపథ్యంలో, జనసేన కేంద్ర కార్యాలయం నేరుగా ఆర్థిక సహకారం అందించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. స్థానిక పరిస్థితులను అధిగమించి జనసేన అభ్యర్థి విజయం సాధించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 6వ డివిజన్ ఫలితం నెల్లూరు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.